వాషింగ్ మెషిన్ లో వాసన వస్తోందా? ఇలా చేయండి అస్సలు రాదు

Published : Sep 12, 2025, 01:02 PM IST

washing machine: వాషింగ్ మెషిన్ ను కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తుండాలి. లేదంటే దీని నుంచి దుర్వాసన వస్తుంది. అయితే చాలా మందికి వాషింగ్ మెషిన్ ను ఎలా శుభ్రం చేయాలో అస్సలు తెలియదు. దీనివల్లే వాషింగ్ మెషిన్ నుంచి దుర్వాసన వస్తుంటుంది. 

PREV
15
వాషింగ్ మెషిన్ క్లీనింగ్

ఈ రోజుల్లో దుస్తులు ఉతకడానికి వాషింగ్ మెషిన్లనే వాడుతున్నారు. రెండు మూడు రోజులకోసారి ఖచ్చితంగా వాషింగ్ మెషిన్ ను ఉపయోగిస్తారు. వాషింగ్ మెషిన్ల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా దుస్తులు తెల్లగా అవుతాయి. అలాగే తొందరగా ఆరుతాయి కూడా. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ వాషింగ్ మెషిన్ల నుంచి కూడా ఒక రకమైన దుర్వాసన వస్తుంటుంది. ఇలా ఎందుకు వస్తుందో కూడా తెలియదు. 

నిజం చెప్పాలంటే వాషింగ్ మెషిన్ ను శుభ్రం చేయకపోవడం వల్లే ఇలా వాసన వస్తుంది. అలాగే మెషిన్ తేమకు ఎక్కువగా గురైతే కూడా ఇలాంటి వాసన వస్తుంది. తడి వల్ల మెషిన్ లోపల బూజు, బ్యాక్టీరియా పేరుకుపోతాయి. ఇది గనుక వాషింగ్ మెషిన్ తలుపు, గాస్కెట్ కింద ఉంటే ఖచ్చితంగా వాషింగ్ మెషిన్ నుంచి దుర్వాసన వస్తుంది. డ్రియిన్ ట్యూబ్ లో అడ్డంకి వల్ల కూడా ఇలా వాన వస్తుంది. అందుకే ఇలాంటప్పుడు వాషింగ్ మెషిన్ ను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

25
వాషింగ్ మెషిన్ ను ఎలా క్లీన్ చేయాలి?

వాషింగ్ మెషిన్ ను బేకింగ్ సోడా, వెనిగర్ తో క్లీన్ ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం 1/4 కప్పు బేకింగ్ సోడాలో 1/4 కప్పు నీళ్లను పోసి బాగా మిక్స్ చేయండి. దీన్ని డిటర్జెంట్ కంటైనర్ ను ఓపెన్ చేసి పోయండి. తర్వాత వైట్ వెనిగర్ ను డైరెక్ట్ గా వాషర్ డ్రమ్ లో పోయండి. ఇప్పుడు మెషిన్ ను ఆన్ చేయండి. 

దీంట్లో వాసన పోయే వరకు పెట్టండి. మెషిన్ పై మరకలు పోవాలంటే స్పాంజితో క్లీన్ చేయండి. వాషింగ్ మెషిన్ గాస్కెట్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయండి. ఎందుకంటే దీనిలో బూజు ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని క్లీన్ చేయడానికి వైట్ వెనిగర్ ను, నీళ్లను సమానంగా తీసుకుని కలపండి. దీన్ని స్క్రబ్ బ్రష్ తో క్లీన్ చేయండి.

35
వాషింగ్ మెషిన్ క్లీనింగ్

అయితే గాస్కెట్ లో బూజు లేదా రబ్బరు ముక్కలు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనిని తొలగించడానికి వెనిగర్ ను నీళ్లను మిక్స్ చేసి దానితో శుభ్రంగా తుడవండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాతే దుస్తులను వేయండి. అలాగే వాషింగ్ మెషిన్ లో బూజు, బ్యాక్టీరియా ఏర్పడకుండా ఉండటానికి మీరు మెషిన్ ఉపయోగించిన ప్రతిసారి గాస్కెట్ ను ఖచ్చితంగా తుడవాలి. అలాగే డ్రమ్, రబ్బరు పట్టీ చక్రాల మధ్య పూర్తిగా ఆరేలా మెషిన్ డోర్ తెరిచే ఉంచాలి.

45
బేకింగ్ సోడా,అల్యూమ్

బేకింగ్ సోడా, అల్యూమ్ తో కూడా వాషింగ్ మెషిన్ ను క్లీన్ చేయొచ్చు. దీన్ని వారానికి ఒక సారి నెలకు నాలుగు సార్లు వాడొచ్చు. ఇందుకోసం సగం బకెట్ గోరువెచ్చని నీళ్లలో 4 లేదా 5 టీ స్పూన్ల బేకింగ్ సోడాను రెండు నుంచి మూడు టీ స్పూన్ల అల్యూమ్ పౌడర్ ను వేసి కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండండి. 

55
వాషింగ్ మెషిన్ క్లీనింగ్

ఇప్పుడు ఖాళీగా ఉన్న వాషింగ్ మెషిన్ డ్రమ్ లోపల పోయండి. ఇప్పుడు మెషిన్ ను 5 నుంచి 10 నిమిషాల పాటు ఆన్ చేయండి. తర్వాత కొద్ది సేపు ఆఫ్ చేసి మళ్లీ ద్రావణాన్ని పోసి రన్ చయండి. తర్వాత అర్థగంట పాటు అలాగే వదిలేయండి. మళ్లీ కొద్దిసేపు రన్ చేయండి. ఈ మిశ్రమం దుర్వాసన, బూజును తొలగిస్తుంది. లాస్ట్ లో డ్రెయిన్ ను నీళ్లు పోసి శుభ్రం చేస్తే సరిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories