డయాబెటీస్ లకు లవంగాల ప్రయోజనాలు
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటీస్ పేషెంట్లకు లవంగాలు ఎన్నో విధాల మేలు చేస్తాయి. లవంగాల్లో యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడాన్ని నిరోధిస్తాయి. ఇన్సులిన్, గ్లూకోస్ స్థాయిలను సక్రమంగా ఉండేందుకు లవంగం నూనె ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు క్లోమగ్రంథిని ఆప్టిమైజ్ చేస్తాయి. క్లోమం ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.