పెళ్లి తర్వాత బరువు పెరగొద్దంటే ఇలా చేయండి

First Published | Dec 28, 2023, 10:28 AM IST

పెళ్లైన తర్వాత కొంతమంది ఆడవారు చాలా ఫాస్ట్ గా బరువు పెరుగుతుంటడం మీరు గమనించే ఉంటారు. దీనికి కొత్త ఇంట్లో ఆహారపు అలవాట్లు కారణం కావొచ్చు. కానీ పెరుగుతున్న బరువును నియంత్రించే ప్రయత్నం చేయకపోతే  మీరు ఎన్నో రోగాల బారిన పడాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత బరువు తగ్గడం ఎలాగో తెలుసుకుందాం పదండి.
 

weight loss

పెళ్లి డేట్ ఫిక్స్ కాగానే అమ్మాయిలు స్లిమ్ గా కనిపించడానికి బరువు తగ్గడం మొదలుపెడుతుంటారు. వీలైనన్ని డైటింగ్, ఎక్సర్ సైజ్ లను చేసేస్తుంటారు. కానీ పెళ్లి తర్వాత మళ్లీ బరువు పెరగడం మొదలుపెడుతుంది. ఇలా చాలా మంది ఆడవారికి జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

నిపుణుల ప్రకారం.. కొత్త ఇంట్లో ఆహారపు అలవాట్లే దీనికి ప్రధాన కారణం. అందరూ భోజనం చేసిన తర్వాత తినడం, పొద్దున్నే లేచి తినడం వల్ల మీరు బరువు పెరుగుతారు. అలాగే మీ సొంత ఆహారం గురించి తెలియక, ఎక్కువ ఫుడ్ ను కూడా అలాగే తినడం వంటి విషయాలతో పాటుగా మరెన్నో విషయాలు మీరు బరువు పెరగడానికి కారణమవుతాయి. మీరు ఎప్పుడూ బరువు పెరగడం వల్ల మీ ఫిగర్ చెడిపోవడమే కాకుండా ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. పెళ్లి తర్వాత బరువును కంట్రోల్ చేసుకునే చిట్కాల గురించి ఇప్పుడు0 తెలుసుకుందాం..

Latest Videos


eating food

సమయానికి తినండి

పెళ్లి తర్వాత బరువు పెరగకూడదనుకుంటే మీరు ఖచ్చితంగా సమయానికి తినడం అలవాటు చేసుకోండి. దీనిలో ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ ను కంప్లీట్ చేసుకోండి. అలాగే నిద్రవేళకు కనీసం రెండు గంటల ముందే డిన్నర్ ను పూర్తి చేయండి. మీరు మీ స్వంతంగా భోజన సమయాన్ని నిర్వహించుకోవచ్చు. ఇలా చేశారంటే మీరు ఖచ్చితంగా బరువు పెరిగే ప్రసక్తే ఉండదు. 

మిగిలిపోయిన వాటిని తినే అలవాటు మానుకోండి

ఈ అలవాటు వల్ల కూడా మీరు ఫాస్ట్ గా బరువు పెరుగుతారు. ఫుడ్ వేస్ట్ కాకూడదని చాలా మంది ఆడవారు మిగిలిపోయిన ఆహారాలను వాళ్లే తింటుంటారు. కానీ అతిగా తినడం వల్ల మీకు ఎన్నో సమస్యలు వస్తాయి. అంటే ఇది మీ శరీరంలో కొవ్వును పెంచుతుంది. 
 

ఒత్తిడికి దూరంగా ఉండండి 

పెళ్లి తర్వాత జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. దీనిలో సర్దుకుపోవడానికి బదులుగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. కానీ ఈ ఒత్తిడి మీ  ఆరోగ్యనికి అతిపెద్ద శత్రువు. ఎందుకంటే ఒత్తిడి కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే నిద్ర విషయంలో కూడా కాంప్రమైజ్ కాకండి. నిద్రతగ్గడం, ఒత్తిడి .. ఊబకాయానికి పెద్ద సంబంధం ఉంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకుని కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నించండి.

click me!