అయితే ఈ నీళ్ల లెక్క అందరికీ ఒకేలా ఉండదు. ఉదాహరణకు వేడి ప్రాంతాల్లో పనిచేసే వారు, బయట ఎక్కువగా తిరిగే వారు, జిమ్‌కి వెళ్లే వారు లేదా ఎక్కువగా చెమటలకు గురయ్యేవారు.. వీరంతా ఎక్కువ నీళ్లు తాగడం అవసరం.కొందరికి రోజుకు 2.5 నుంచి 3 లీటర్ల వరకు కూడా అవసరం ఉండొచ్చు. అలాగే శరీర బరువు, వయసు, ఆరోగ్య పరిస్థితి ఇవి కూడా ప్రభావం చూపిస్తాయి.దాహం వేసే వరకు వెయిట్ చేయకుండా ముందుగానే నీళ్లు తాగాలి. నీళ్లు సరిపడినంత తాగితే మూత్రం లైట్ కలర్‌లో వస్తుంది. మూత్రం ముదురు రంగులో వస్తే శరీరానికి సరిపడా నీరు తాగడం లేదని అర్థం.