మిక్సర్ జార్ శుభ్రం చేయడానికి కావాల్సిన పదార్థాలు..
నిమ్మకాయ, బేకింగ్ సోడా, డిటర్జెంట్ పౌడర్, నీరు. ఇవి ఉంటే చాలు.. మళ్లీ జార్ ని కొత్త దానిలా మార్చవచ్చు.
శుభ్రం చేసే విధానం..
ఒక మిక్సర్ జార్ అడుగు భాగాన ముందుగా.. ఒక స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. తర్వాత దానిపై నిమ్మరసం పిండాలి. ఆ తర్వాత అందులోనే డిటర్జెంట్ పౌడర్ కూడా వేయాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు పోయాలి. జిడ్డు మరీ ఎక్కువగా ఉంటే వేడి నీరు కూడా పోయవచ్చు. 15 నిమిషాలు దానిని అలానే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల అడుగున పేర్కొన్న మురికి, జిడ్డు మొత్తం పోతుంది. ఇప్పుడు.. 15 నిమిషాల తర్వాత, స్క్రబ్బర్ లేదా టూత్‌బ్రష్‌తో బాగా రుద్దాలి. మిక్సీ జార్‌ను శుభ్రం చేయడానికి మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో ప్రత్యేక పొడవాటి బ్రష్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి, మీరు బ్లేడ్ కింద ఉన్న మురికిని సులభంగా తొలగించవచ్చు.
చివరగా, శుభ్రమైన నీటితో కడగండి. మీ మిక్సర్ జార్ కొత్తదానిలా మెరిసిపోతుంది. కడిగిన తర్వాత, జార్‌ను పూర్తిగా ఆరనివ్వాలి. తేమ వల్ల బ్లేడ్‌లు తుప్పు పట్టవచ్చు.