రోజుకు ఎన్ని అరటిపండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా..?

Published : Aug 29, 2022, 12:49 PM IST

రోజుకో అరటిని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యం బాగుంటుంది కదా అని వీటిని ఎక్కువగా తింటే మాత్రం ఆ సమస్యలను ఫేస్ చేయక తప్పదు.   

PREV
16
రోజుకు ఎన్ని అరటిపండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా..?

సీజన్లతో సంబంధం లేకుండా దొరికే పండ్లు ఏవైనా ఉన్నాయా.. అంటే అవి అరటి పండ్లు ఒక్కటే. అందులోనూ ఇవి చాలా చవకగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇష్టమే. ఈ పండ్లు తియ్యగా టేస్టీగా ఉండటమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. అలా అని మోతాదుకు మించి తింటే మాత్రం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

26

రోజుకు మూడు పూటలా ఒక్కొక్కటి తిన్నా మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా నాశనం చేసుకున్న వారవుతారు. మీకు తెలుసా..?  ఈ పండ్లను ఎక్కువగా తింటే మలబద్దకం సమస్య బారిన పడతారు. అంతేకాదు మైగ్రేన్ నొప్పి కూడా వస్తుంది. అందుకే మైగ్రేన్ నొప్పితో బాధపడేవారు అరటిపండ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. అయితే వీళ్లు డాక్టర్ సలహా తీసుకుని రోజుకు ఒకటి తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. 
 

36

ఇకపోతే షుగర్ వ్యాధి ఉన్నవారి ఆరోగ్యానికి ఈ అరటిపండ్లు మంచివి కావు. ఎందుకంటే రెండు కంటే ఎక్కువ అరటిపండ్లను తింటే.. వీరి రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరుగుతాయి. ఇంతేకాదు అరటి పండ్లను ఎక్కువగా తింటే చాలా ఫాస్ట్ గా బరువు పెరుగుతారు కూడా. అందుకే బరువు తగ్గాలనుకునే వారు అరటిపండ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

46

అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎక్కువైతే  హైపర్కెల్మియా అనే అనారోగ్య సమస్య వస్తుంది. ఇక అరటిలో అధికమొత్తంలో ఉండే ఫైబర్  వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది. మీరు గమనించే ఉంటారు.. అరటిపండ్లను తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుంది. మీకు తెలుసా.. అరటిపండ్లను అతిగా తినడం వల్ల దంతక్షయం సమస్య కూడా వస్తుంది. వీటికి తోడు వీటి తిన్నవెంటనే నిద్రమబ్బు పట్టుకుంటుంది.  ఉదయం తిన్నా.. మబ్బుగానే ఉంటారు. 
 

56

రోజూ ఎన్ని తింటే మంచిది?

రోజూ రెండు అరటిపండ్లను భేషుగ్గా తినొచ్చు. అదికూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు. ఉదయం, మధ్యాహ్నం. అయితే దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారు అరటిపండ్లను తినకూడదు. ఈ పండ్లు ఈ సమస్యలను మరింత ఎక్కువ చేస్తాయి. ఇక ఈ పండ్లు పిల్లలకు చాలా మంచివి. రోజూ ఒకటి తినిపిస్తే ఆరోగ్యంగా ఉంటారు. 

66

రోజూ ఒక అరటి పండు తిన్నా మీరు ఆరోగ్యంగా ఉంటారు. అదికూడా మీడియం సైజులోది. ఎందుకంటే దీనిలో పొటాషియం మోతాదుగా ఉంటుంది. దీంతో పొటాషియం నిల్వలు మన శరీరంలో ఎక్కువ కావు. అరటిలో ఉండే లెక్టిన్ బ్లడ్ క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తుంది. అంతేకాదు శరీరానికి హానిచేసే ఫ్రీ రాడికల్స్ నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తుంది. అతిసారాన్ని తగ్గించడంలో కూడా అరటిపండ్లు సహాయపడతాయి. అరటి శరీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories