Maida: మైదా పిండిని దేనితో తయారు చేస్తారు? గోధుమ పిండికీ, మైదా పిండికీ తేడా ఏంటి?

Published : Oct 21, 2026, 11:42 AM IST

Maida: గోధుమ పిండి, మైదా పిండి రెండూ గోధుమలతోనే తయారు చేస్తారు. మరి, గోధుమ పిండి మంచిది.. మైదా మంచిది కాదు అని ఎందుకు చెబుతారు? ఈ రెండింటికీ తేడా ఏంటి?

PREV
13
మైదా తో చేసిన ఫుడ్స్ తింటున్నారా?

మనం రెగ్యులర్ గా తినే చాలా ఆహారాలను మైదా పిండితోనే తయారు చేస్తారు. బేకరీలో కేకులు, కరకరలాడే సమోసాలు, నాన్, బిస్కెట్లు ఇలా అన్ని రకాల ఫుడ్స్ ని కేవలం మైదాతోనే తయారు చేస్తారు. నిజం చెప్పాలంటే.. అవన్నీ మైదాతో చేస్తేనే రుచిగా ఉంటాయి. కానీ, ఆరోగ్య పరంగా చూస్తే.. మైదా తినకూడదు అని చెబుతారు. అసలు.. మైదా ఎందుకు తినకూడదు? మైదా దేనితో తయారౌతుంది?

23
మైదా పిండి ఎలా తయారౌతుంది..?

మైదా కూడా మనం రోజూ వాడుకునే గోధుమల నుంచే తయారౌతుంది. కాకపోతే, దానిని ప్రాసెస్ చేసే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ముందుగా, గోధుమలను శుభ్రం చేసి, వాటిలోని మట్టి, ధూళిని తొలగిస్తారు. ఆ తర్వాత, ఈ గింజలను రోలర్ మిల్లుల ద్వారా రుబ్బి, పొట్టు, జెర్మ్, ఎండోస్పెమ్ ను వేరు చేస్తారు. ఈ వేరు చేసిన దాంట్లో నుంచి తెల్లటి పిండి ( ఎండోస్పెమ్) మాత్రమే పలుమార్లు జల్లించి, అల్ట్రా ఫైన్ మైదాను తయారు చేస్తారు. ఈ పిండి కొంచెం పసుపు రంగులో ఉంటుంది. అయితే, దీనిని ఆకర్షణీయంగా మరింత తెల్లగా మార్చడానికి బెంజాయిలా పెరాసైడ్ లేదా క్లోరిన్ డయాక్సైడ్ వంటి రసాయనాలతో బ్లీచ్ చేస్తారు.

33
మైదా ఎందుకు తినకూడదు..?

మైదా ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరూ చెబుతుంటారు. ఎందుకు అంటే.. ఈ పిండిలో పీచు పదార్థం ఉండదు. మైదా తయారీలో.. పొట్టు అంతా తొలగిపోవడం వల్ల ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే, ఈ మైదాతో తయారు చేసిన ఫుడ్స్ తినడం వల్ల మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. అంతేకాదు, మైదాలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న వెంటనే గ్లూకోజ్ గా మారి రక్తంలో షుగర్ లెవల్స్ ని పెంచుతుంది. కాబట్టి, షుగర్ పేషెంట్స్ పూర్తిగా మైదాతో చేసిన ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. అంతేకాదు, మైదాను రిఫైన్ చేసే ప్రక్రియలో విటమిన్లు, ఖనిజాలు అన్నీ పోతాయి. మిగిలినదంతా అందులో ఉండేది పిండి పదార్థమే. దీని వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. ఈ పిండితో చేసిన ఫుడ్స్ తినడం వల్ల... అప్పటికప్పుడు శరీరానికి మంచి శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ, కొద్దిసేపటి తర్వాత నీరసంగా అనిపిస్తుంది. మళ్లీ.. షుగర్ క్రేవింగ్స్ వచ్చేస్తాయి. జంక్ ఫుడ్ తినాలనే కోరిక మరింత పెరుగుతుంది. దీని వల్ల అధిక బరువు పెరిగిపోతారు. ఇది మాత్రమే కాకుండా, మైదా తయారీలో కొన్ని రకాల రసాయనాలు వాడతారు. ఇవన్నీ.. మన జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. చాలా రకాల ఆరోగ్య సమస్యలు తెచ్చి పెట్టే అవకాశం ఉంది.

మైదాని పూర్తిగా మానేయాలా..?

ఎప్పుడో ఒకసారి పండగ సందర్భాల్లో లేదా బేకరీ ఐటమ్స్ రూపంల మైదా తీసుకోవడం వల్ల పెద్దగా నష్టం లేదు. కానీ, రోజూ మైదాతో చేసిన బ్రెడ్ లు, పిజ్జాలు, పాస్తాలు, బిస్కెట్లు తీసుకోవడమే అసలు సమస్య. మైదాకు బదులుగా గోధుమ పిండి, జొన్న, సజ్జ, రాగి లేదా శనగ పిండి లాంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

మైదా అనేది మన శరీరానికి పూర్తిగా విషం కాకపోయినా, ఆరోగ్యకరమైన ఆహారం అయితే కాదు. దీన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ, మితంగా వాడటమే ఆరోగ్యానికి మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories