Butterfly Chicken: పండగ విందులో అదిరిపోయే చికెన్ స్టార్టర్..రెసిపీ చాలా సింపుల్

Published : Oct 20, 2026, 08:50 PM IST

Butterfly Chicken: దసరా అంటే కక్కా, ముక్కా ఉండాల్సిందే. అలా అని ఎప్పుడూ చేసే నాన్ వెజ్ ఏం తింటాం. ఈ పండక్కి కొత్తగా ఇలా బటర్‌ఫ్లై చికెన్ ట్రై చేయండి. రెస్టారెంట్లలో దొరికే ఈ క్రిస్పీ చికెన్ స్టార్టర్‌ను ఈజీగా చేసుకోవచ్చు. రెసిపీని చూద్దాం.

PREV
15
దసరా అంటే కక్కా, ముక్కా ఉండాల్సిందే

దసరా పండగ అంటే కక్కా, ముక్కా ఉండాల్సిందే. అల్లుళ్లు, కూతుర్లతో ఇళ్లు కళకళలాడిపోతుంది. కోడూ, మేకూ తెగాల్సిందే. అందుకని వాటితో ఎప్పుడూ చేసే నాన్ వెజ్ రెసిపీస్ చేస్తే ఎవ్వరికైనా బోర్ కొడుతుంది. అయితే చికెన్‌తో కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? దానికి బటర్‌ఫ్లై చికెన్ బెస్ట్ ఆప్షన్. బయట రెస్టారెంట్లలో దొరికే ఈ క్రిస్పీ చికెన్ స్టార్టర్‌ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చికెన్ ముక్కలకు మసాలాలు పట్టించి, బంగాళాదుంప ముక్కల మధ్య పెట్టి వేయించడం దీని ప్రత్యేకత. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

25
కావాల్సిన పదార్థాలు

బోన్‌లెస్ చికెన్ – 800 గ్రాములు

బంగాళాదుంపలు – 3 (మీడియం సైజులో)

గుడ్లు – 2

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు

వెనిగర్ – 2 టీస్పూన్లు

కారం – 1 టీస్పూన్

చాట్ మసాలా – 1 టీస్పూన్

సోయా సాస్ – 1½ టీస్పూన్లు

రెడ్ చిల్లీ పేస్ట్ – 1 టేబుల్ స్పూన్

కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు (మారినేషన్ కోసం), కొద్దిగా (బంగాళాదుంపల కోసం)

మైదా – 3 టేబుల్ స్పూన్లు

నల్ల మిరియాల పొడి – 1 టేబుల్ స్పూన్

నిమ్మరసం – 2 టేబుల్ స్పూన్లు

నల్ల ఉప్పు, మామూలు ఉప్పు – తగినంత

నువ్వులు – కొద్దిగా

నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

టూత్‌పిక్స్ – చికెన్, బంగాళాదుంప ముక్కలను కలిపి ఉంచడానికి

35
తయారీ విధానం

ముందుగా ఒక పెద్ద గిన్నెలో చిన్న ముక్కలుగా కట్ చేసిన బోన్‌లెస్ చికెన్ తీసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, చాట్ మసాలా, నల్ల మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత గుడ్లు, సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, వెనిగర్, నిమ్మరసం, కార్న్ ఫ్లోర్, మైదా వేసి చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. గిన్నెపై మూత పెట్టి 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి మారినేట్ చేయాలి.

45
బంగాళాదుంప ముక్కలను రెడీ చేసుకోవాలి

బంగాళాదుంపలను పొట్టు తీసి పలుచటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని నీటితో శుభ్రంగా కడగాలి. ఒక గిన్నెలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ తీసుకుని నీళ్లు పోసి పలుచటి మిశ్రమంలా తయారు చేయాలి. అందులో బంగాళాదుంప ముక్కలను వేసి సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టాలి.

బటర్‌ఫ్లై ఆకారంలో తయారు చేయాలి

ఇప్పుడు బంగాళాదుంప ముక్కలను బయటకు తీసి, వాటి మధ్యలో మారినేట్ చేసిన చికెన్ ముక్కను పెట్టాలి. బంగాళాదుంప ముక్కలను చికెన్‌కు ఇరువైపులా మడిచి, టూత్‌పిక్‌తో గట్టిగా కాకుండా జాగ్రత్తగా బిగించాలి. ఇలా చేయడం వల్ల చికెన్, బంగాళాదుంప ముక్కలు విడిపోకుండా ఉంటాయి.

55
చికెన్‌ను వేయించాలి

బాణలిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియం స్థాయికి తగ్గించాలి. సిద్ధం చేసుకున్న బటర్‌ఫ్లై చికెన్ ముక్కలను నెమ్మదిగా నూనెలో వేయాలి. బయట బంగారు రంగులోకి మారి క్రిస్పీగా అయ్యే వరకు, లోపల చికెన్ పూర్తిగా ఉడికేలా వేయించాలి. పైన కొద్దిగా నువ్వులు చల్లి వేడివేడిగా సర్వ్ చేయాలి. టమాటో సాస్ లేదా మీకు నచ్చిన డిప్‌తో తింటే అదిరిపోద్ది.

చిన్న చిట్కా

చికెన్‌కు మసాలాలు బాగా పట్టాలంటే కనీసం 3 గంటలు మారినేట్ చేయడం మంచిది. బంగాళాదుంప ముక్కలు మరీ మందంగా ఉంటే సరిగా వేగకపోవచ్చు. అందుకే వీలైనంత పలుచగా కట్ చేసుకోవాలి. నూనె మరీ ఎక్కువ వేడిగా ఉంటే బయట త్వరగా రంగు మారి, లోపల చికెన్ ఉడకకపోవచ్చు. కాబట్టి మీడియం మంటపై వేయించాలి. చికెన్ పూర్తిగా ఉడికిందో లేదో తప్పనిసరిగా చూసుకోవాలి. అంతే.. క్రిస్పీగా, మసాలా రుచితో ఉండే బటర్‌ఫ్లై చికెన్ రెడీ. సాయంత్రం స్నాక్స్‌గా, ఇంట్లో జరిగే చిన్నపాటి పార్టీల్లో స్టార్టర్‌గా దీన్ని తయారు చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories