ఈ గ్రామంలో జరిగిన వింతలు...
ఈ గ్రామంలో జరిగిన వింతలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పూర్వకాలంలో ఇక్కడి మాంత్రికులు తమ చేతిలోని మంత్రంతో మనుషులను జంతువులుగా మార్చేవారనే ప్రచారం ఉంది. అంతేకాదు, క్రీ.శ. 1337లో మహమ్మద్ షా అనే పాలకుడు దాదాపు లక్ష మంది బలమైన సైన్యంతో అస్సాంపై దండయాత్రకు వచ్చాడు. కానీ మయాంగ్ సరిహద్దుల్లోకి అడుగుపెట్టిన ఆ సైన్యం ఒక్కసారిగా ఆనవాళ్లు లేకుండా మాయమైపోయిందని అస్సాం చారిత్రక కథనాలు చెబుతాయి. ఇదంతా ఇక్కడి మాంత్రికుల ప్రయోగాల వల్లే జరిగిందని నమ్ముతారు.
మంత్రాలతో వైద్యం.. 'మయాంగ్ సెంట్రల్ మ్యూజియం'
ఇక్కడ కేవలం క్షుద్రపూజలే కాకుండా, ప్రాచీన ఆయుర్వేద మూలికలు, మంత్రాల కాంబినేషన్‌తో తీవ్రమైన రోగాలను కూడా నయం చేసేవారు. పాము కాటుకు గురైన వారిని కాపాడటం, నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నవారి నొప్పిని క్షణాల్లో మాయం చేసేవారట. ఈ గ్రామం ప్రాచీన సంస్కృతిని కాపాడటానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైన మ్యూజియం కూడా ఉంది. ఇందులో ప్రాచీన మంత్ర శాస్త్ర తాళపత్ర గ్రంథాలు, క్షుద్రపూజలకు ఉపయోగించిన కత్తులు, బలిపీఠాల ఆయుధాలను ఇప్పటికీ ప్రదర్శనకు ఉంచారు.
ఇప్పటికీ అక్కడ క్షుద్రపూజలు చేస్తారా?
కాలక్రమేణా సైన్స్ అభివృద్ధి చెందడం, అక్షరాస్యత పెరగడంతో మయాంగ్‌లో క్షుద్రపూజల ప్రభావం చాలా వరకు తగ్గింది. ఒకప్పుడు భయంతో ఎవ్వరూ అడుగుపెట్టడానికి సాహసించని ఈ గ్రామం, నేడు ఒక ప్రముఖ టూరిస్ట్ స్పాట్గా మారింది. ఒకప్పుడు ప్రతి ఇంటికో మాంత్రికుడు ఉండేవాడు. కానీ, ఇప్పుడు అలా కాదు. కేవలం ఒకరిద్దరు మాత్రమే.. ఇప్పటికీ ఆ వృత్తిని కొనసాగిస్తున్నారట. మిగిలిన ప్రజలు సామాన్య జీవితాన్నే గడుపుతున్నారు.