రోజూ చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో తెలుసా..?

First Published Sep 25, 2021, 4:41 PM IST

మేకప్ వేసుకున్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కాలుష్య కారకాలు, నూనెలు ప్రతిరోజూ చర్మంలోకి దూరుతుంటాయి. అందుకే వీటిని రోజూ శుభ్రం చేయడం చాలా అవసరం. రోజంతా మురికి, సూక్ష్మక్రిములు పేరుకుపోయిన ముఖంతో అలాగే పడుకుంటే మీ ముఖానికున్న సూక్ష్మక్రియులు దిండుకు చేరి.. అక్కడ వృద్ధి చెంది తిరిగి మీకే హానికరంగా మారతాయి. అందుకే పడుకునే ముందు ముఖాన్ని శుభ్రపరచుకోవడం తప్పనిసరి. 

మీరు ప్రతిరోజూ ఎలాంటి ఫేస్ కేర్ రొటీన్ పాటిస్తున్నారు? మీరు రోజూ రెండుసార్లు రెగ్యులర్ ఫేస్ వాష్ ఉపయోగిస్తున్నారా? లేదా ఫేస్ టోనర్, క్లీన్సింగ్ మిల్క్ వాడుతున్నారా? లేదా వీటన్నింటికీ సమయం లేదు అనుకుంటున్నారా? రోజూ స్నానం చేస్తే సరిపోతుంది కదా? అనుకుంటున్నారా? అయితే అది కరెక్ట్ కాదు. మీ ముఖాన్ని రోజూ పాంపర్ చేయాల్సి ఉంటుంది. 

మేకప్ వేసుకున్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కాలుష్య కారకాలు, నూనెలు ప్రతిరోజూ చర్మంలోకి దూరుతుంటాయి. అందుకే వీటిని రోజూ శుభ్రం చేయడం చాలా అవసరం. రోజంతా మురికి, సూక్ష్మక్రిములు పేరుకుపోయిన ముఖంతో అలాగే పడుకుంటే మీ ముఖానికున్న సూక్ష్మక్రియులు దిండుకు చేరి.. అక్కడ వృద్ధి చెంది తిరిగి మీకే హానికరంగా మారతాయి. అందుకే పడుకునే ముందు ముఖాన్ని శుభ్రపరచుకోవడం తప్పనిసరి. 

దీనికోసం క్లెన్సింగ్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. మనకు తెలియదు కానీ ముఖం అనేక రకాల దుమ్ము కణాలు, కాలుష్యాలను పట్టుకుంటుంది. అందుకే ముఖాన్ని ప్రతిరోజూ శుభ్రం చేయకపోతే మొటిమలు, నల్ల మచ్చలు, ఇతర చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, మీరు రెండు పద్ధతులను ఉపయోగించి మీ ముఖాన్ని శుభ్రపరచొచ్చు. అందులో మొదటిది ఫేస్ క్లెన్సర్‌ని ఉపయోగించడం, రెండవది మీ చర్మ రకానికి తగిన ఫేస్ వాష్‌ని ఉపయోగించడం. క్లెన్సింగ్ మిల్స్,ఫేస్ వాష్ రెండూ రోజులోని మురికి, సూక్ష్మక్రిముల నుండి ముఖాన్ని శుభ్రంగా ఉంచే సమర్థంగా చేస్తాయి. అయితే ఒక్కటే తేడా ఏంటంటే క్లెన్సింగ్ మిల్స్ నురగ ఉండదు. జస్ట్ తుడుచేస్తే సరిపోతుంది. కానీ అదే ఫేస్ వాష్ అయితే తప్పనిసరిగా నురగ బాగా వస్తుంది.. నీటితో శుభ్రం చేయాల్సి ఉంటుంది. 

జిడ్డు చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడే క్రీమీ సొల్యూషన్ ను క్లెన్సింగ్ మిల్క్ అంటారు. దీన్ని సాధారణంగా మేకప్‌ని తుడిచేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ క్లెన్సింగ్ మిల్క్ ను మీ ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. అంతేకాదు ఈ క్రీం చర్మాన్ని పొడి బారనీయదు. దాంతోపాటు ముఖానికి చక్కటి లగ్జరీ షైన్ ను ఇస్తుంది. 

జిడ్డు చర్మానికి ఎలాంటి క్లెన్సింగ్ మిల్క్ సరిపోతుంది.. అంటే చర్మాన్ని కాపాడుకోవడానికి మాయిశ్చరైజ్ వాడినప్పుడు అది అధిక సెబమ్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడగలిగే క్లెన్సింగ్ మిల్క్ కరెక్ట్. ఇది జిడ్డు చర్మానికి బాగా పనిచేస్తుంది. అలాంటి వాటిల్లో ఒకటే బట్టర్ క్లెన్సింగ్ మిల్స్. ఇది మీ చర్మంమీది సహజ తేమ, సమతుల్యతను కాపాడుతూ మలినాలు, ధూళిని తొలగిస్తూ మీ ముఖ ఉపరితలాన్ని జెంటిల్ గా క్లీన్ చేస్తుంది. అదనంగా, బ్లూ లోటస్, గ్రీన్ టీ, కలబంద సారం కలయిక సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అదే సమయంలో, మీ ముఖం నుండి మేకప్, ధూళి, మలినాలను తొలగించడానికి అవి సహాయపడతాయి.

టోనర్‌ ఉద్దేశ్యం ఏమిటంటే.. ముఖాన్ని శుభ్రపరిచిన తర్వాత రెండవ దశ ఎల్లప్పుడూ చర్మాన్ని టోన్ చేయడం. ఒక టోనర్ అన్ని మలినాలను నిర్ధారిస్తుంది. మేకప్ ను పూర్తిగా తీసేస్తుంది. ఇది చర్మం పీహెచ్ ను కాపాడుతుంది. సమతుల్యతను మెయింటేన్ చేయడానికి దోహదపడుతుంది. తద్వారా చర్మంమీది మొటిమలు, పగుళ్లను తగ్గిస్తుంది. అదనంగా, ఫేస్ టోనర్ వాడకం వల్ల మీ చర్మ రంధ్రాలను బిగుతుగా అవుతాయి.

గతంలో, టోనర్‌లు ఆల్కహాల్ ఆధారితంగా ఉండేవి, కానీ ఇప్పుడు అవి సున్నితంగా ఉంటున్నాయి. చర్మ రకాన్ని బట్టి దొరుకుతున్నాయి. మరి వీటిల్లోనూ మంచి టోనర్‌ను ఎలా ఎంచుకుంటారు? అంటే... విటమిన్ సి ఫేస్ టోనర్‌తో కూడిన టోనర్ అన్ని రకాల చర్మాలకూ సరిపోయేది.  

click me!