Chapati: చపాతీలు చేసిన ప్రతిసారి గట్టిగా వస్తున్నాయా? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే. వీటిని పాటిస్తే హోటల్ స్టైల్ దూదిలాంటి మెత్తటి చపాతీలను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి చపాతీ మెత్తగా రావడానికి పిండిని ఎలా కలపాలో, ఏం వేయాలో ఇక్కడ చూద్దాం.
మెత్తటి దూదిలాంటి చపాతీలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నచ్చిన కర్రీతో చపాతీలు తింటే ఆ ఫీలింగే వేరు. కానీ చాలామందికి ఎంత ట్రై చేసినా సాఫ్ట్ చపాతీలు చేయడం రాకపోవచ్చు. మరి హోటల్ స్టైల్లో మెత్తటి చపాతీలను ఈజీగా చేయాలంటే ఏం చేయాలో, ముఖ్యంగా పిండిని ఎలా కలపాలో ఇక్కడ తెలుసుకుందాం.
25
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - 2 కప్పులు
గోరువెచ్చని నీళ్లు - తగినన్ని
పాలు - 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు
నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్
ఉప్పు - తగినంత
చపాతీ కాల్చడానికి నూనె లేదా నెయ్యి - తగినంత
35
పిండి కలిపే విధానం
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అందులో ఒకేసారి నీళ్లు పోయకుండా, కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని కలపడం మొదలుపెట్టాలి.
చపాతీలు మరింత సాఫ్ట్‌గా రావాలంటే నీళ్లతో పాటు కొద్దిగా పాలు కూడా కలుపుకోవచ్చు.
పిండి ముద్దలా అయ్యాక ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి బాగా కలపాలి.
పిండి మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని చేతికి అంటుకునేలా కాకుండా మెత్తగా ఉండాలి.
పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయకూడదు. దానిపై కొద్దిగా నూనె రాసి మూతపెట్టి 15 - 20 నిమిషాలు పక్కన పెట్టాలి. దీనివల్ల పిండి బాగా సెట్ అయి చపాతీలు మెత్తగా వస్తాయి.
ఆ తర్వాత పిండిని సమాన సైజులో ఉండలుగా చేసుకోవాలి. పొడి పిండి చల్లుతూ పల్చగా రుద్దాలి. రుద్దిన చపాతీని నాలుగు మడతలుగా మడిచి, మళ్లీ నెమ్మదిగా రుద్దాలి.
ఇలా మడిచి మళ్లీ రుద్దడం వల్ల లోపల పొరలు ఏర్పడతాయి. చపాతీ కాల్చేటప్పుడు పొరలు పొరలుగా, మెత్తగా పొంగుతూ వస్తుంది.
55
సాఫ్ట్ చపాతీ రెడీ
పెనాన్ని బాగా వేడి చేసి, చపాతీని వేయాలి. ఒకవైపు చిన్న బుడగలు రాగానే చపాతీని తిరగేయాలి.
రెండో వైపు కూడా కాలాక మళ్లీ తిరగేసి, తేలికగా ఒత్తాలి. దీంతో చపాతీ బాగా పొంగుతుంది.
పొయ్యి మీద నుంచి తీయగానే కొద్దిగా నెయ్యి రాసి, మూత ఉన్న గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. మరి ఆలస్యమెందుకు నెక్ట్స్ టైం చపాతీలు చేసినప్పుడు ఈ టిప్స్ కచ్చితంగా ట్రై చేసి చూడండి.