కడుపునకు సంబంధించిన సమస్యలు మొత్తంగా ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అజీర్థి, గ్యాస్ట్రిక్, మలబద్ధకం, గుండెల్లో మంట, పుల్లటి త్రేన్పులు కడుపునకు సంబంధించిన సమస్యలు. తినడం, నిద్రపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి వంటి అలవాట్ల వల్ల ఈ సమస్యలు వస్తాయి. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సమస్యల నుంచి సులువుగా బయటపడొచ్చు.