ఇలా చేస్తే మీ జుట్టు సిల్కీగా ఉంటుంది..

First Published Jan 6, 2023, 4:57 PM IST

చలికాలంలో జుట్టు గరుకుగా మారుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మీ జుట్టు చలికాలంలో కూడా మృదువుగా, సిల్కీగా ఉంటుంది. మరి ఇందుకోసం ఏం చేయాలంటే..
 

జుట్టు సంరక్షణలో ఒక్కొక్కరూ ఒక్కో పద్దతిని ఫాలో అవుతుంటారు. కొందరైతే మార్కెట్ లోకి వచ్చిన ప్రతి ప్రొడక్ట్ ను వాడుతుంటారు. ఇంకొందరు ఇంటి చిట్కాలను ఫాలో అవుతుంటారు. మరికొందరు పార్లర్ కు వెళతారు. ఏదేమైనా ఇంటి చిట్కాలే మంచివి. ఎందుకంటే వీటిలో జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇవి చాలా సేఫ్. ఇకపోతే చలికాలంలో చాలా మంది జుట్టు గరుకుగా మారుతుంది. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే గరుకుదనాన్ని పోగొట్టి.. జుట్టును మృదువుగా, సిల్కీ గా మార్చొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

సిల్కీ జుట్టు కోసం అరటిపండు, తేనె ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో అరటిపండు, తేనె ప్యాక్ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇందుకోసం ముందుగా అరటిపండ్లు తీసుకుని మెత్తగా చేయండి. దీనికి తేనె కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు చివర వరకు బాగా అప్లై చేయండి.  ఇది పూర్తిగా ఆరిన తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయండి. ఈ ప్యాక్ మీ జుట్టును మృదువుగా, సిల్కీగా చేస్తుంది. వారానికి 1 సారి ఈ ప్యాక్ ను వేసుకుంటే తేడాను గమనిస్తారు. 
 

పెరుగు, కలబంద జెల్ ను ప్యాక్ కూడా జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ప్యాక్ వల్ల చలికాలంలో వచ్చే జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. ముందుగా కలబంద జెల్ ను తీసుకుని దానికి పెరుగును కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్ల వరకు బాగా పట్టించండి. ఇది ఆరిన తర్వాత షాంపూతో క్లీన్ చేయండి. దీంతో జుట్టు మృదువుగా, సిల్కీగా ఉంటుంది. ఈ ప్యాక్ ను మీరు వారానికి 2 నుంచి 3 రోజులు ఉపయోగించొచ్చు.

తేనె, ఆలివ్ ఆయిల్ హెయిర్ ప్యాక్ కూడా మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో కొద్దిగా తేనెను వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుంతా బాగా పట్టించండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టును మృదువుగా, సిల్కీగా మారుస్తుంది. 
 

ఆపిల్ సైడర్ వెనిగర్ తో మీ జుట్టు సిల్కీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని అందులో కొన్ని నీళ్లను పోసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టంతా బాగా అప్లై చేయండి. కావాలనుకుంటే దీనిని ఒక బాటిల్ లో వేసి స్ప్రే చేయండి. కొద్దిసేపటి తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. ఇది మీకు మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ వల్ల జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే జుట్టు మృదువుగా, సిల్కీగా తయారవుతుంది. ఈ పద్ధతులను క్రమం తప్పకుండా అనుసరించండి. కొన్ని రోజుల్లోనే తేడాను మీరే గమనిస్తారు. 
 

click me!