దోసకాయలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6, రోబోఫ్లేవిన్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇది కళ్లకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు కళ్లపై నల్లటి వలయాలు ఏర్పడినప్పుడు వాటిని తొలగించేందుకు కూడా ఈ దోసకాయ ముక్కను ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల కళ్లు హైడ్రేట్ గా, తాజాగా అవుతాయి. దోసకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కళ్ల చికాకును, వాపును కూడా తగ్గిస్తుంది. దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కళ్లపై ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేస్తే సరి. కళ్ల సమస్యను మటు మాయం చేయవచ్చు.