చల్లగాలుల వల్ల తలనొప్పి వస్తోందా? తగ్గాలంటే ఇలా చేయండి..

Published : Jan 16, 2023, 03:56 PM IST

చలికాలంలో తలనొప్పి రావడం సర్వ సాధారణ విషయం. నిజానికి తలనొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే తలనొప్పి చిటికెలో తగ్గిపోతుంది.   

PREV
16
చల్లగాలుల వల్ల తలనొప్పి వస్తోందా? తగ్గాలంటే ఇలా చేయండి..

చలికాలంలో తలనొప్పి తరచుగా వస్తుంది. వాతావరణంలో మార్పులు, ముఖ్యంగా చల్లని వాతావరణం, సెరోటోనిన్ తో సహా మెదడు రసాయనాలలో అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది కొంతమందిలో మైగ్రేన్ నొప్పిని కలిగిస్తుంది. జలుబు వల్ల వచ్చే తలనొప్పిని వదిలించుకోవడానికి సైనస్ వాపును తగ్గించడం, సైనస్ ల నుంచి శ్లేష్మం బయటకు పోయేలా చేయడం చాలా ముఖ్యం. నాసికా రద్దీని క్లియర్ చేయడానికి మన నాసికా మార్గాలను తేమగా ఉంచడం ఉత్తమ మార్గం. పొడి సైనస్లు మరింత చికాకును కలిగిస్తాయి.
 

26

శీతాకాలంలో తలనొప్పికి కారణాలు

మన శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. అధిక ఒత్తిడి లేదా తగినంత నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. దీనికితోడు చలికాలం కూడా తలనొప్పికి కారణమవుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. తక్కువ ఉష్ణోగ్రత, తరచుగా తలనొప్పికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. అందుకే లోపలి నుంచి మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవాలి. చలికాలంలో తలనొప్పి తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36

అల్లం

తలనొప్పిని తగ్గించడంలో అల్లం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది నొప్పిని తగ్గించడానికి సహాయపడటమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కూడా. ఇది వికారాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. తక్షణ ఉపశమనం కోసం మీరు మీ నుదిటిపై అల్లం పొడిని లేదా, అల్లం పేస్ట్ ను ఉపయోగించొచ్చు.  లేదా మీరు ఉదయం లేదా సాయంత్రం టీలో అల్లాన్ని వేసుకుని తాగొచ్చు. కావాలనుకుంటే అల్లం రసం, నిమ్మరసాన్ని సమానంగా తీసుకుని వాటిని మిక్స్ చేసి రిఫ్రెషింగ్ డ్రింక్ ను తయారుచేసుకుని తాగొచ్చు. 
 

46

కెఫిన్

జలుబు కారణంగా తలనొప్పి వస్తే.. వెచ్చని అనుభూతినిచ్చే వాటిని తీసుకోవచ్చు. తలనొప్పి ఉన్నప్పుడు తరచుగా టీ లేదా కాఫీ తాగాలని సూచిస్తుంటారు. ఎందుకంటే టీ, కాఫీ లో ఉండే కెఫిన్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు మెదడును రిలాక్స్ గా ఉంచుతుంది.
 

56
Image: Getty Images

దాల్చినచెక్క

దాల్చినచెక్క తలనొప్పిని తగ్గించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీనిని ఉపయోగించడానికి ఉత్తమ మార్గం కొన్ని దాల్చినచెక్కను తీసుకుని పొడి చేయండి. దీంట్లో కొంత నీరు పోసి పేస్ట్ లా తయారుచేయండి. దీన్ని నుదుటిపై అప్లై చేస్తే తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే సరి. 
 

66
Image: Getty Images

లవంగాలు

లవంగాల్లో నొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. దీనిని ఉపయోగించడానికి సరళమైన మార్గం లవంగాను మెత్తగా నూరి శుభ్రమైన చేతి రుమాలులో ఉంచి పీల్చండి. రెండు చుక్కల లవంగ నూనె తీసుకుని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, సముద్రపు ఉప్పును ఉపయోగించి పేస్ట్ తయారు చేయండి. దీనితో మీ నుదిటిని మసాజ్ చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories