ఇలాంటి దుస్తులు వేసుకుని హోలీ ఆడిరో మీ పని అంతే.. !

First Published Mar 24, 2024, 2:42 PM IST

హోలీ 2024:  రంగుల పండుగ రేపే. ఇప్పటి నుంచే ఎవరెవరికి రంగులు పూయాలి? ఏ రంగులతో ఆడుకోవాలి? అంటూ ఎన్నో అనుకుంటుంటారు. హోలీ సరదాగా ఆడుకోవాలంటే మాత్రం మీరు ఆరోజు కొన్ని రకాల దుస్తులను వేసుకోవడం మానుకోవాలి. 

హోలీని ఎంజాయ్ చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. రంగులను చల్లుకోవడంతో పాటుగా నీళ్లు కలిపిన వాటర్ తో ఆడుకుంటుంటారు. వీటివల్ల చర్మం దెబ్బతింటుంది. అందుకే ఈ హోలీ ఆడేవారు కొన్ని రకాల దుస్తులను వేసుకోవాలి. కొన్నింటిని వేసుకోకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

holi 2024

పల్చని ఫ్యాబ్రిక్

హోలీ ఆడేవారు పల్చని ఫ్యాబ్రిక్ దుస్తులను అస్సలు వేసుకోకూడదు. జార్జెట్, షిఫాన్, లినిన్ వంటి దుస్తులు తడిచినప్పుడు శరీరానికి అంటుకుంటాయి. దీని వల్ల మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే హోలీ ఆడాలనుకుంటే వీటిని మాత్రం వేసుకోకండి. 
 


ఫుల్ స్లీవ్

హోలీ ఆడేవాళ్లు ఫుల్ స్లీవ్, టైట్ కుర్తా లేదా చుడీదార్ వంటి టైట్ గా ఉండే దుస్తులను వేసుకోవడం మానుకోండి. ఎందుకంటే ఇవి తడిసిన తర్వాత మరింత టైట్ అవుతాయి. వీటిని ఇప్పడం కష్టం. ఈ ప్రయత్నంలో బట్టలు చిరిగిపోవచ్చు కూడా. అందువల్ల హోలీ ఆడేటప్పుడు మరీ బిగుతుగా ఉండే దుస్తులను వేసుకోకండి. 
 

లో క్వాటిటీ దుస్తులు

హోలీ ఆడేటప్పుడు మీరు లో క్వాలిటీ దుస్తులను వేసుకోవడం మానుకోండి. ఇలాంటి దుస్తులను వేసుకుంటే అవి చిరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే సౌకర్యవంతమైన బట్టలనే వేసుకోండి. దీనివల్ల మీరు  మధ్యమధ్యలో మీ దుస్తులను చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఎంచక్కా ఆడుకోవచ్చు. 
 

మందపాటి ఫ్యాబ్రిక్

హోలీ ఆడటానికి మీరు స్వెట్టర్లు లేదా చాలా మందంగా ఉండే దుస్తులను వేసుకుంటే అవి తడిసి జలుబు చేస్తుందనే భయం ఉంటుంది. ఎందుకంటే హోలీ ఆడేటప్పుడు దుస్తులు తడుస్తాయి. వీటిని ఎప్పటికో విప్పేస్తారు. అప్పటి వరకు ఒంటిపైనే ఉంటే జలుబు ఖచ్చితంగా చేస్తుంది.
 


సరైన దుస్తులు ఏవి? 

హోలీ ఆడటం వల్ల చర్మం దెబ్బతినకూడదంటే ఫుల్ స్లీవ్, ఫుల్ లెంగ్త్ దుస్తులను వేసుకోవాలి.  హోలీ ఆడేటప్పుడు లేత రంగు దుస్తులు ధరిస్తే అవి మళ్లీ ధరించడానికి పనికిరావు. కాబట్టి రంగురంగుల దుస్తులను వేసుకోండి. వీటివల్ల మీరు చూడటానికి సౌకర్యవంతంగా ఉంటారు. 

కాటన్ ఫ్యాబ్రిక్

హోలీ ఆడటానికి మంచి క్వాలిటీ కాటన్ ఫ్యాబ్రిక్ దుస్తులను వేసుకోండి. ఇవి ఫాస్ట్ గా ఎండిపోవడమే కాకుండా శరీరానికి తక్కువగా అంటుకుంటాయి. దీంతో మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. 

click me!