అలియా భట్ ఎన్నో సినిమాల్లో నటిస్తూ అభిమానులను మెప్పిస్తూనే ఉంది. ప్రొఫేషనల్ లైఫ్, పెళ్లి, మాతృత్వంలో అలియా అభిమానులకు ఫేవరెట్ గా మారింది. వర్క్ ఫ్రంట్ అయినా, ఫ్యామిలీ అయినా అన్నింటినీ ఈ హీరోయిన్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతూనే ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో అందరి లాగే అలియా కూడా బరువు పెరిగారు. కానీకూతురు రాహా పుట్టిన తర్వాత ఆమె శరీరాకృతి మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కూతురు పుట్టిన 4 నెలల్లోనే ఆమె తిరిగి తన పాత రూపానికి వచ్చేసింది. అసలు బిడ్డ పుట్టిన తర్వాత ఆలియా భట్ బరువును ఎలా తగ్గించుకుంటుందో ఒక వ్లాగ్ లో పంచుకుంది. అది ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం..