బంతి, చామంతి, గులాబీ పువ్వులతో హోలీ రంగులు.. ఎలా తయారుచేయాలంటే?

Published : Mar 14, 2024, 03:44 PM IST

Holi 2024: రంగుల పండుగ హోలీని ఈ ఏడాది మనం మార్చి 25న  జరుపుకోబోతున్నాం. రంగుల పండుగ రంగులు లేకుండా పూర్తి కాదు. కానీ బయట కొనే కెమికల్ రంగులు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అందుకే వీటికి బదులు ఇంట్లోనే రంగులను తయారుచేసి ఆడుకోవచ్చు. అది కూడా పువ్వులతో. పువ్వులతో రంగులను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.   

PREV
17
 బంతి, చామంతి, గులాబీ పువ్వులతో హోలీ రంగులు.. ఎలా తయారుచేయాలంటే?

Holi 2024: చిన్నా, పెద్దా అంటూ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హోలీని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగను రంగులతో ఆడుకుంటూ జరుపుకుంటారు. రంగుల పండుగ కాబట్టి రంగులు పక్కాగా ఉండాల్సిందే. బయట మనకు ఎన్నో రకాల రంగులు దొరుకుతాయి. కానీ వీటిలో కెమికల్స్ ఉంటాయి. ఈ రంగుల వల్ల చర్మంపై దద్దుర్లు, కంటి సమస్యలతో పాటుగా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు తెలుసా? ఒకప్పుడు పువ్వులు, ఆకులతో రంగులను తయారుచేసి వాడేవారు. కెమికల్స్ రంగులతో ఇబ్బంది పడేబదులుగా నేచురల్ రంగులను వాడమే బెటర్. నిజానికి రంగులను తయారుచేయడం చాలా సులువు. ఇంట్లోనే కొన్ని పువ్వులతో మీరు నేచురల్ కలర్స్ ను తయారుచేయొచ్చు. అదెలాగో తెలుసుకుందాం పదండి. 
 

27

అపరాజిత పువ్వులు

ఈ పువ్వులు నీలం రంగులో ఉంటాయి. కాబట్టి మీరు ఈ అందమైన పువ్వులతో నీలం రంగును సులువుగా తయారుచేయొచ్చు. ఈ పువ్వులతో నీలం రంగు పౌడర్ లేదా రంగు వాటర్ ను తయారుచేయొచ్చు. ఈ పువ్వులు మన చర్మానికి ఎలాంటి హాని చేయవు.
 

37

బంతిపూలు

బంతిపూలను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. ఇంటి అలంకరణ నుంచి సహజ రంగుల తయారీ వరకు పెళ్లిళ్లు, పండుగల్లో కూడా బంతిపూలను బాగా ఉపయోగిస్తారు. మనకు బంతిపూలు పసుపు, నారింజ, ఎరుపు రంగుల్లో దొరుకుతాయి. కాబట్టి మీరు ఈ పువ్వులతో మూడు రకాల రంగులను తయారుచేయొచ్చు. 
 

47

మందార

మందార పువ్వులు కూడా ఎన్నో రంగుల్లో దొరుకుతాయి. వీటితో మీరు చాలా రకాల కలర్స్ ను తయారుచేయొచ్చు. ఎరుపు, గులాబీ, తెలుపు, పసుపు వంటి నేచురల్ కలర్స్ ను మీరు మందార పువ్వులతో తయారుచేయొచ్చు. హోలీకి ఇవి బెస్ట్ కలర్స్ అవుతాయి. 

57

క్రిసాంథిమమ్

వసంత ఋతువులో పూచే క్రిసాంథెమమ్ పువ్వుల నుంచి కూడా మీరు హోలీ సహజ రంగును తయారు చేయొచ్చు. ఈ పువ్వుల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. వీటితో మీరు రకరకాల హోలీ కలర్స్ ను తయారుచేయొచ్చు. 

67

గులాబీలు

గులాబీ పువ్వులు కూడా చాలా రంగుల్లో ఉంటాయి. అందులోనూ గులాబీ పువ్వులు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. అందుకే ఈ హోలీకి మీరు నేచురల్ కలర్స్ ను వాడాలనుకుంటే గులాబీ పువ్వులతో రంగులను తయారుచేయండి. 

77
holi

సహజ రంగుల ప్రయోజనాలు 

ఈ రంగులు అలెర్జీ ఉన్నవారికి ఎలాంటి హాని కలిగించదు. 

కళ్లు, నోట్లోకి ఈ రంగులు వెళ్లినా ఎలాంటి సమస్యా రాదు. 

ముక్కు, చెవులు, గొంతుకు కూడా ఏ విధంగానూ హానికరం కాదు.

Read more Photos on
click me!

Recommended Stories