పిల్లలకు బోర్ కొట్టకుండా పేరెంట్స్ ఏం చేయొచ్చో తెలుసా?

First Published | Mar 14, 2024, 2:40 PM IST

పెద్దలకే కాదు పిల్లలకు కూడా అప్పుడప్పుడు బోర్ కొడుతుంటుంది. ఏం చేయాలో తోచదు. దీంతో మూడీగా కూర్చోవడమో, తల్లిదండ్రులను విసిగించడమో చేస్తుంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే?


ఏం చేయాలో తోచనప్పుడు బోరింగా అనిపిస్తుంది. పెద్దలకే బోర్ కొడుతుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ పిల్లలకు కూడా బోర్ కొడుతుంది తెలుసా? అవును ఆటపై విరక్తి వచ్చినప్పుడు పిల్లలకు ఏం చేయాలో తోచదు. దీంతో మూడీగా కూర్చుంటుంటారు. కానీ పిల్లలకు బోరింగ్ గా అనిపించడం అవసరమని శిశువైద్యులు చెబుతున్నారు. అవును పిల్లలకు బోర్ కొట్టినప్పుడు వారిలో సృజనాత్మకత పెరుగుతుందట. మరి పిల్లలకు బోర్ కొట్టినప్పుడు పేరెంట్స్ ఏం చేయాలో తెలుసుకుందాం పదండి. 
 

సృజనాత్మకతను ప్రోత్సహించండి

మీరు కొంచెం ప్రయత్నించాలే కానీ.. మీ పిల్లల్ని మేథావుల్ని చేయొచ్చు. మంచి ప్రయోజకులుగా తీర్చొ దిద్దొచ్చు. పిల్లలకు బోర్ కొట్టినప్పుడు ళా సామాగ్రి, హస్తకళలు లేదా సంగీత పరికరాలను ఇవ్వండి. వాటిని పిల్లలకు నేర్పించండి. ఇలాంటి సమయంలోనే పిల్లలు కొత్త వాటిని కూడా చాలా తొందరగా నేర్చుకుంటారు. 

Latest Videos


అవుట్ డోర్ గేమ్స్ 

చాలా మంది పిల్లలు టీ, ఫోన్ లోనే ఆన్లైన్ గేమ్స్ ను ఆడుతుంటారు. దీనివల్ల పిల్లల కళ్లు, ఆరోగ్యం బాగా దెబ్బతింటాయి. అందుకే మీ పిల్లలకు బోరింగ్ గా అనిపించినప్పుడు బయట ఆడుకోమని చెప్పండి. మీరు వాకింగ్ కు వెళ్లినా, దగ్గర్లోని పార్కుకు వెళ్లినా ఆరుబయట సమయం గడిపేలా చూడండి. అవుట్ డోర్ గేమ్స్ పిల్లలో ఊహాశక్తిని ప్రేరేపిస్తుంది. వారిలో శారీరక శ్రమను కూడా పెంచుతుంది. ఇది మీ పిల్లల్ని హెల్తీగా ఉంచుతుంది. 
 

సోషల్ ఇంటరాక్షన్ 

పిల్లల్ని ఎప్పుడూ ఒంటరిగా ఉంచడం మంచిది కాదు. దీనివల్ల మీ పిల్లల ఎదుగుదల బాగుండదు. అందుకే ఇతర పిల్లలతో మీ పిల్లల్ని ఆడుకోనివ్వండి. దీనివ్లల సోషల్ ఇంటరాక్షన్, టీమ్ మేనేజ్ మెంట్ స్కిల్స్ పెరుగుతాయి. ఇది వారి బాల్యాన్ని మధురమైన క్షణంగా చేస్తుంది.

వాహనాన్ని కడగడం 

పిల్లలు చాలా పనులను ఇంట్రెస్టింగ్ గా చేస్తుంటారు. వాటిలో వాహానాలను కడగడం ఒకటి. అందుకే మీ పిల్లలకు బోరింగా అనిపించినప్పుడు మీరు, మీ పిల్లలు ఉపయోగించే సైకిల్ లేదా  బైక్ లేదా కారును క్లీన్ చేయమని చెప్పండి. ఇది వాళ్లకు అనుభూతిని కలిగిస్తుంది. 


వారి ఇంట్రెస్ట్ ను తెలుసుకోండి

పిల్లలకు బోర్ కొట్టకూడదంటే వారికి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలను ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. గేమ్స్, మ్యూజిక్, డ్యాన్స్ ఇలా వారికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ కార్యకలాపాలను చేయించండి. ఇది వారికి విసుగు రాకుండా చేస్తుంది. 

click me!