మహేష్... ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది ఎంత నిజం అంటే.. వయసు పెరుగుతున్నాకొద్ది మహేష్ బాబులో ఆ ఛార్మింగ్ మెస్మరైజేషన్ తగ్గడం లేదు. రోజురోజుకూ కుర్రాడిలా తయారవుతున్నాడు. 46యేళ్ల వయసులోనో సిమ్లా ఆపిల్ పండులా ఉంటాడు. మరి మహేష్ యంగ్ లుక్స్ సీక్రెట్ ఏంటీ?
సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు. దశాబ్దాల నుంచి స్పెషల్ లేడీ ఫాన్ ఫాలోయింగ్ లో తెలుగు ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు.
29
మహేష్ బాబుకు ఇన్ స్ట్రా గ్రాంలో ఉన్న ఫాలోయింగ్ తెలిస్తే షాక్ అవుతారు. 8 మిలియన్ ఫాలోవర్స్ తో మాసివ్ ఫాన్ బేస్ మహేష్ సొంతం.
39
మహేష్ బాబుకు ప్రస్తుతం 46 యేళ్లు.. కానీ 30 అంటే నమ్మేలా ఉంటాడు. ఉండడమేంటి.. అలాగే కనిపిస్తారు. అందుకే లేడీ ఫ్యాన్స్ పిచ్చెత్తిపోతారు.
49
మరి మహేష్ ఇలా ఇంత వయసు తక్కువగా కనిపించడానికి కారణమేంటి..? ఆ రహస్యం ఏంటీ?? కాస్త తెలిస్తే మేమూ ఫాలో అవుతాం కదా.. అనుకుంటుంటారు చాలామంది. మరి చూడండి.
59
మహేష్ మొహంలో సహజకాంతి కనిపిస్తుంది. దీనికి కారణం క్రమం తప్పని వ్యాయామమే... రోజూ గంటన్నరపాటు ఖచ్చితంగా వ్యాయామం చేస్తాడు.
69
ప్రోటీన్ చర్మ పొరల మధ్య ఏర్పడే ఖాళీలను పూరించడంలో కీలకంగా పనిచేస్తాయి. అందుకే మహేష్ రోజూ క్రమం తప్పకుండా కచ్చితమైన మోతాదులో ప్రోటీన్ తన ఆహారంలో ఉండేలా చూసుకుంటాడు.
79
విటమిన్ సి, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాడు. ఈ రెండూ శరీరంలో కొల్లాజిన్ స్థాయిల్ని పెంచుతాయి. దీనివల్ల చర్మం బలంగా తయారవుతుంది.
89
జంక్ ఫుడ్ కు చాలా దూరంగా ఉంటాడు. డైట్ ఖచ్చితంగా ఫాలో అవుతాడు. అదే మహేష్ మొహంలో కనిపిస్తుంటుంది. మీరూ అలా కావాలంటే జంక్ ఫుడ్ కు టాటా చెప్పాల్సిందే.
99
ఎప్పుడూ సంతోషంగా ఉండడం, చక్కటి కుటుంబ జీవితం ఇవే తన అందానికి అసలు రహస్యం అని మహేష్ నమ్ముతాడు. దీనికి తగ్గట్టుగానే మహేష్ ఫ్యామిలీ మ్యాన్.. షూటింగ్ తరువాత కుటుంబానికే తన సమయాన్ని కేటాయిస్తాడు.