watermelon: తియ్యని, ఎర్రని పుచ్చకాయను గుర్తించలేకపోతున్నారా? ఇదిగో ఈ ట్రిక్స్ ను ఫాలో అయిపోండి..

Published : May 13, 2022, 10:45 AM IST

watermelon: ఈ సీజన్ లో పుచ్చకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండును తింటే ఒంట్లో వేడి తగ్గడమే కాదు.. బాడీ హైడ్రేటెడ్ గా కూడా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఉండే పోషకాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి కూడా రక్షిస్తాయి. అయితే ఈ పండును కొనేటప్పుడు చాలా మంది కన్ఫూజ్ అవుతుంటారు. ఏ కాయ ఎర్రగా, తియ్యగా ఉంటుందా అని బోలెడు పండ్లను చూస్తుంటారు.   

PREV
19
watermelon: తియ్యని, ఎర్రని పుచ్చకాయను గుర్తించలేకపోతున్నారా? ఇదిగో ఈ ట్రిక్స్ ను ఫాలో అయిపోండి..

ప్రస్తుతం మన దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీనికి తోడు దారుణమైన ఉక్కపోతలు ప్రజలను కుదురుగా ఉండనివ్వడం లేదు. అంతేకాదు ఈ సీజన్ లో శరీర ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరిగిపోతుంటాయి. అందుకే ఈ సీజన్ లో కూల్ డ్రింక్స్ ను, ఫ్రూట్ జ్యూస్ లను ఎక్కువగా తాగుతుంటారు. 

29

ముఖ్యంగా ఈ కాలంలో అన్ని పండ్లలో పుచ్చకాయనే ఎక్కువగా తింటుంటారు. కారణం ఈ పుచ్చకాయ శరీరంలో నీటి కొరతను భర్తీ చేస్తుంది. అంతేకాదు ఈ పండు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.  అలాగే ఈ పండు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది. 

39

సాధారణంగా పుచ్చకాయను ఉప్పు లేదా చక్కెరతో తినడానికి ఇష్టపడుతుంటారు. పుచ్చకాయలో ఎన్నో పోషకాలుంటాయి. ఇవి ఎన్నో రోగాలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. 
 

49

పుచ్చకాయ మనకు చేసే మేలు.. పుచ్చకాయలో 95 శాతం నీరు ఉంటుంది. ఇది మన శరీరంలోని నీటి కొరత లేకుండా చేస్తుంది. అందుకే ఈ సీజన్ లో పుచ్చకాయను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అయితే మనం కొనే అన్ని పండ్లు తియ్యగా, ఎర్రగా ఉండవు. దీంతో చాలా మంది వీటిని కొనడానికి వెనకాడుతుంటారు. కానీ కొన్ని చిట్కాలతో తియ్యని, ఎర్రని పుచ్చకాయను కొనేయొచ్చు. అవేంటో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

59

లేత పసుపు రంగులో ఉండాలి.. చాలా మంది ఇక్కడే పెద్ద తప్పు చేస్తుంటారు. ఆకుపచ్చగా ఉండే పుచ్చకాయలనే కొంటుంటారు.  కానీ ఇలాంటి పండ్లు తియ్యగా ఉండకపోవడమే కాదు.. ఎర్రగా కూడా ఉండవు. అందుకే పైన లేత పసుపు పచ్చగా ఉండేట్టు చూసుకోండి. ఇలాంటి రంగులో ఉండే కాయలే లోపల ఎర్రగా, తీయగా ఉంటాయి. అలాగే పుచ్చకాయ  అడుగు భాగాన పసుపు మరకలు ఎక్కువగా ఉంటే కూడా ఆ పండు ఎంతో తియ్యగా ఉంటుంది. 
 

69

ఇలా చేయండి.. ఒక పుచ్చకాయను కొందామనుకున్నప్పుడు ముందు దాన్ని ఒకచేత్తో పట్టుకుని మరో చేత్తే సౌండ్ వచ్చేలా వేలితో కొట్టి చూడండి.. అప్పుడే అది సౌండ్ వస్తే తియ్యగా ఉన్నట్టు.  లేకపోతే ఆ పండు తియ్యగా లేదని అర్థం చేసుకోండి. 

79

చెక్ చేయండి.. పుచ్చకాయను కొనేటప్పుడు దానికి ఎక్కడైనా రంధ్రం లేదా కట్ చేసే ఉందేమో బాగా చెక్ చేయండి. ఎందుకంటే పుచ్చకాయ తర్వగా పక్వానికి రావడానికి మనకు హానీ కలిగించే హార్మోన్ల ఇంజెక్షన్లను ఇస్తుంటారు. 
 

89
Watermelon

వెయిట్ ఎంతుందో తెలుసుకోండి.. మీరు సెలక్ట్ చేసుకున్న పుచ్చకాయ బరువుగా, నిండుగా ఉంటే అది తియ్యగా ఉండదు. పుచ్చకాయ బరువులో తేలికగా ఉంటేనే తియ్యగా, ఎర్రగా ఉంటాయి. 

99

పుచ్చకాయ ఆకారాన్ని పరిశీలించండి.. ఓవల్ ఆకారపు (Oval-shape)పుచ్చకాయలు ఎక్కువ తియ్యగా ఉంటాయి. ఇతర ఆకారంలో ఉండే పుచ్చకాయలు కచ్చిగా ఉంటాయి. మీరు పుచ్చకాయలను కొనాలనుకున్నప్పుడు గుడ్డు ఆకారంలో ఉండేట్టు చూసి కొనండి .

click me!

Recommended Stories