Fashion Tips: ఆఫీసులకు వెళ్లే ఆడవాకిరి ఈ రకమైన హ్యాండ్ బ్యాగులు బాగుంటాయి..వీటిలో స్టైలీష్ గా కూడా కనిపిస్తారు

Published : May 13, 2022, 11:54 AM ISTUpdated : May 13, 2022, 11:59 AM IST

Office Handbags: హ్యాండ్ బ్యాగులు చిన్నచిన్న వస్తువులను తీసుకెళ్లడానికి సహాయపడతాయి. అంతేకాదు ఈ హ్యాడ్ బ్యాగులు మీరు స్టైలీష్ గా కనిపించేలా కూడా చేస్తాయి. అందుకే హ్యాండ్ బ్యాగులను ఎలాంటివి కొనాలో తెలుసుకోవాలి.   

PREV
16
Fashion Tips: ఆఫీసులకు వెళ్లే ఆడవాకిరి ఈ రకమైన హ్యాండ్ బ్యాగులు బాగుంటాయి..వీటిలో స్టైలీష్ గా కూడా కనిపిస్తారు

Office Handbags: ఆఫీసులకు వెళ్లే ప్రతి మహిళకు అత్యవసర వస్తువుల్లో హ్యాడ్ బ్యాగ్ ఒకటి. ఇది కేవలం ఒక హ్యాడ్ బ్యాగ్ యే కాదు.. ఎన్నో వస్తువులను భద్రంగా దాచిపెట్టే చిన్న బ్యాంక్ లాంటిది. ఫోన్, డబ్బులు, ఇతర అత్యవసర వస్తువులను దాచి పెట్టడానికి హ్యాండ్ ఎంతో ఉపయోగపడుతుంది. 
 

26
Office Handbags

అయితే ఈ బ్యాగులు వస్తువులను దాచే  వస్తువును గానే కాదు.. ఇది మీ హుందాతనాన్ని కూడా తెలియజేస్తుంది. అందుకే ఏ బ్యాగ్ మీ కు సరిపోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం రకరకాల రంగుల్లో,, డిజైన్లలో హ్యాండ్ బ్యాగులో మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని స్త్రీలు ధరించే దుస్తులు, జీవన శైలిని బట్టి ఎంచుకోవచ్చు. అయితే మీకు నచ్చే.. మిమ్మల్ని స్టైలీష్ గా కన్పించేలా చేసే కొన్ని రకాల హాండ్ బ్యాగులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

36
Office Handbags

టోట్ హ్యాండ్ బ్యాగ్ (Tote handbag): ఈ రోజుల్లో టోట్ హ్యాండ్ బ్యాగులు ట్రెండింగ్ లో ఉన్నాయి. అంతేకాదు ఆఫీసులకు వెల్లే చాలా మంది ఆడవాళ్లు వీటిని కొనడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మార్కెట్ లో ఎన్నో రకాల మరియు ప్రింటెడ్ స్టైల్ లో ఈ హ్యాండ్ బ్యాగులు చాలా ఉన్నాయి. 
 

46
Office Handbags

లెదర్ షోల్డర్ హ్యాడ్ బ్యాగులు (Leather shoulder handbags): లెదర్ షోల్డర్ హ్యాండ్ బ్యాగులు ఆఫీసులకు తీసుకెళ్లడానికి ఎంతో కంఫర్టబుల్ గా ఉంటాయి. ఈ రకమైన హ్యాండ్ బ్యాగులు చాలా విభిన్న రూపంలో ఉంటాయి. ఈ బ్యాగులు మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా చూపిస్తాయి. నలుపు ,గోధుమ, తెలుపు రంగు బ్యాగులను ఎక్కువగా ట్రెండింగ్ ఉంటాయి. ఈ లెదర్ షోల్డర్ హ్యాండ్ బ్యాగులు ఎలాంటి దుస్తులకైనా ఇట్టే నప్పుతాయి. అది చీరైనా, లేదా ఫార్మల్ అవుట్ ఫిట్ అయినా సరే ఇది ప్రతి డ్రెస్ కు సెట్ అవుతుంది. 
 

56
Office Handbags

ల్యాప్ టాప్ షోల్డర్ స్లింగ్ ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్ (Laptop Shoulder Sling Office Handbag).. మీరు ప్రతిరోజూ ఆఫీసుకు ల్యాప్ టాప్ పు తీసుకెళ్లాల్సి వస్తే.. మీకు ల్యాప్ టాప్ షోల్డర్ స్లింగ్ ఆఫీస్ హ్యాండ్ బ్యాగ్ ను ఎంచుకోవచ్చు. పెద్దగా ఉండే ఫైళ్లు కూడా ఈ బ్యాగ్ లో పెట్టుకునే విధంగా పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఇది ఆఫీసులకు వెళ్లే వారికి చక్కటి ఎంపికనే చెప్పాలి. అయితే ఈ బ్యాగులను కేవలం బ్లాక్ కలర్ లోనే తీసుకోవాల్సిన అవసరం. మీకు నచ్చిన రంగులో తీసుకున్నా చక్కగా కనిపిస్తారు. 
 

66
Office Handbags

క్రాస్ బాడీ హ్యాండ్ బ్యాగులు (Cross body handbags).. ఇవి చాలా స్టైలీష్ గా ఉంటాయి. ముఖ్యంగా ఈ రకమైన బ్యాగులు పార్టీలకు తీసుకెళ్లేందుకు చక్కగా ఉంటాయి. అలాగే ఇవి మిమ్మల్ని ప్రొఫెషనల్ గా లేదా స్మార్ట్ లుక్ లో కనిపించేలా చేస్తాయి. ఇలా కూడా వీటిని తీసుకెళ్లొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories