ముఖంపై ఉండే మొండి మచ్చలను సులువుగా వదిలించే చిట్కాలివిగో..

Published : Jul 02, 2022, 02:54 PM IST

ముఖంపై కొన్ని మచ్చలు చాలా ఏండ్ల పాటు కూడా అలాగే ఉంటాయి. అయితే వీటిని సహజ పద్దతుల్లో కూడా చాలా సులువుగా వదిలించుకోవచ్చు. అదెలాగంటే.. 

PREV
17
ముఖంపై ఉండే మొండి మచ్చలను సులువుగా వదిలించే చిట్కాలివిగో..

కొన్ని రకాల మచ్చలు చర్మంపై శాశ్వతంగా అలాగే ఉండిపోతాయి. ఇవి ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. మొటిమలు మచ్చలు, గాలిన గాయాలు, మొటిమలు, శస్త్ర చికిత్సల కారణంగా మచ్చలు అవుతాయి. కానీ ఈ మచ్చలు అంత సులువుగా వదిలిపోవు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఈ మచ్చలకు గుడ్ బాయ్ చెప్పొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
 

27

బేకింగ్ సోడా (Baking soda)

బేకింగ్ సోడాలో మచ్చలను వదిలించే గుణముంటుంది. ఇది ఎంత మొండి మచ్చలనైనా సులువుగా వదిలిస్తుంది. ఇందుకోసం రెండు వంతుల వాటర్ లో ఒక వంతు బేకింగ్ సోడాను వేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ను మచ్చలపై అప్లై చేయాలి. ఇది ఆరిన తర్వాత ముఖం కడిగేటప్పుడు మచ్చలపై నెమ్మదిగా రుద్దాలి. 
 

37

కొబ్బరి నూనె (coconut oil)

కొబ్బరి నూనె వెంట్రుకలకే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ నూనెతో మొండి మచ్చలను వదిలించుకోవచ్చు. దీనిలో పుష్కలంగా ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చర్మ రంద్రాల్లోకి వెళ్లి చర్మాన్ని రిపేర్ చేస్తాయి. ముఖాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది. హైడ్రేట్ గా కూడా ఉంచుతుంది. 

47

కలబంద (Aloe vera)

కలబందలో చర్మానికి మేలు చేసే ఔషదగుణాలుంటాయి. దీనిలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చర్మ సమస్యలను తొలగిస్తుంది. ముఖంపై కలబంద జెల్ ను అప్లై చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి, మచ్చలన్నీ మటుమాయం అవుతాయి. అంతేకాదు ఇది కొత్త చర్మకణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది. 

57

బంగాళాదుంప రసం (Potato juice)

బంగాళాదుంప రసంలో ఉండే ఫైటోకెమికల్స్ మొటిమలను, మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలను తొలగించడమే కాదు.. ముఖంపై పేరుకుపోయిన మురికిని కూడా తొలగిస్తాయి. ఇందుకో కొద్దిగా బంగాళాదుంప రసం తీసుకుని కాటన్ లో అద్ది  మచ్చలకు అప్లై చేయండి. కొన్ని నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితాలొస్తాయి. 
 

67

నిమ్మరసం (lemon juice)

నిమ్మరసం కూడా మచ్చలను వదిలించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నిమ్మకాయ రసాన్ని పిండి అందులో ఒక కాటన్ గుడ్డను ముంచి ముచ్చలపై పెట్టి కొన్ని నిమిషాల తర్వాత కడిగేయండి. నిమ్మరసంలో ఉండే ఆమ్లాలు మచ్చలను తొలగించడానికి సహాయపడతాయి. 
 

 

77


తేనె (honey)

కాలిన గాయాలను, గాయాల వల్ల ఏర్పడ్డ మచ్చలను తొలగించేందుకు తేనెను ఏండ్ల నుంచి వాడుతున్నారు. తేనెను మచ్చలపై అప్లై చేయడం వల్ల.. మచ్చలు మెల్లిమెల్లిగా మసకబారి కొన్ని రోజులకు పూర్తిగా తగ్గిపోతాయి. ఇందుకోసం ప్రతిరోజూ మచ్చలపై తేనెను అప్లై చేయాలి. 

Read more Photos on
click me!

Recommended Stories