
సైలెంట్ కిల్లర్ గా పిలువబడే గుండె పోటు ఎంతో మంది యువకుల ప్రాణాలను తీసింది. తీస్తూనే ఉంది. ఒకప్పుడు పెద్దవయసు వారికి ఇది వచ్చేది. ఇప్పుడు 40 ఏండ్ల వయసు వారు సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి బాహ్య కారణాలుగా.. జీవన శైలి, ఒత్తిడి, కుటుంబ చరిత్ర వంటివి చెప్పుకోవచ్చు.
బాహ్య కారణాల సంగతి పక్కన పెడితే శరీరం లోపల అంతా సవ్యంగా జరిగితే ఇలాంటి రోగాలు వచ్చే చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇక మన శరీర ఆరోగ్యాన్ని మనం తీసుకునే ఆహారమే నిర్ణయిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు మన ఆరోగ్యాన్ని దారుణంగా ప్రభావితం చేస్తాయి. అలాగే ఇంకొన్ని ఆహారాలు గుండెను ప్రమాదంలో పడేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉప్పు (salt)
ఉప్పు మన శరీరానికి చాలా అవసరం. అయినప్పటికీ దీనిని మోతాదుకు మించి అస్సలు తినకూడదు. ముఖ్యంగా ఒక వయోజనుడు రోజుకు 5 గ్రాములకు తక్కువ కాకుండా ఉప్పును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది ఉప్పును మోతాదుకు మించి తినేవాళ్లు చాలా మందే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వినియోగాన్ని అవసరం మేరకే తీసుకుంటే.. ప్రతి ఏడాది 2.5 మిలియన్ల మరణాలు తగ్గుతాయని తెలియజేసింది.
సోడియం మన శరీరానికి అవసరమయినప్పటికీ ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది శరీరానికి ప్రాణాంతకం కావొచ్చు. ఒక పరిశోధన ప్రకారం.. భారతీయులు ఒక రోజుకు 11 గ్రాముల కంటే ఎక్కువగా ఉప్పును తీసుకుంటున్నారట. అంటే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దానికంటే ఎక్కువ. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
సంతృప్త కొవ్వు
American Heart Association ప్రకారం.. మనం తీసుకునే రోజు వారి ఆహారంలో సంతృప్త కొవ్వు 5 నుంచి 6 ఉంటే సరిపోతుంది. ఇంతకు మించితేనే శరీరం దెబ్బతింటుంది. కాగా వయసు పెరుగుతున్న కొద్దీ కొవ్వు పదార్థాలను చాలా వరకు తగ్గించాలి. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఈ కొవ్వులను తీసుకోకపోవడమే మంచిది. కాగా ఈ సంతృప్త కొవ్వులు కొన్ని నూనెల్లో జుంతు ఉత్పత్తులో ఉంటుంది.
చక్కెర (Sugar)
చక్కెర మన శరీరానికి చాలా అవసరం. అలా అని అదేపనిగా చక్కెరను తీసుకుంటే మాత్రం ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వయోజనులు రోజుకు 30గ్రాముల చక్కెరను తీసుకుంటే చాలు. ఇంతకు మించి తీసుకుంటే గుండె జబ్బులు వచ్చి మీ ప్రాణాలకే ప్రమాదం కలుగుతుంది. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే గుండె ప్రమాదంలో పడుతుందని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
కాగా షుగర్ వినియోగంపై ఒక పరిశోధన 15 సంవత్సరాలకు పైగ కొనసాగింది. ఈ అధ్యయనం ప్రకారం.. రోజుకు 25 శాతం కంటే ఎక్కువ మొత్తంలో షుగర్ తీసుకునే వ్యక్తిని.. 25 శాతం కంటే తక్కువగా తీసుకునే వ్యక్తితో పోల్చితే.. అతనే తొందరగా గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు గుండెపోటుతో మరణించే అవకాశం రెట్టింపులో ఉందని పరిశోధనలు తేల్చి చెప్పాయి.
కేకులు, సోడాలు, పేస్ట్రీలు, బాటిల్ డ్రింక్ ల్లో ఉండే షుగర్ గుండెకు ఏ మాత్రం మంచిది కాదు. వీటిల్లో ఉండే చక్కెర గుండెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది.
తక్కువ నిద్ర (less sleep)
ఈ రోజుల్లో కంటి నిండా నిద్రపోయే వారు తక్కువేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ సరిగ్గా నిద్రపోతేనే శరీరం, మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. ఒకవేళ అలసిన శరీరానికి విశ్రాంతి లేకపోతే కూడా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
నిపుణుల అభిప్రాయం ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అలా పడుకుంటే మీరు మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
వీటితో పాటుగా మీ గుండెను స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన అలవాట్లు కూడా ప్రమాదంలో పడేస్తాయి. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండండి.
ఇంటి ఫుడ్ కంటే బయటఫుడ్ నే ఎక్కువగా తినే వారు చాలా మందే ఉన్నారు. వివిధ యాడ్ లల్లో చూసి రకరకాల చిప్స్ ను ప్యాకెట్స్ ను కొని లాగిస్తుంటారు. కానీ ఇవి గుండెపోటుకు దారితీస్తాయి. చిన్నవయసు వారు గుండెపోటు బారిన పడటానికి అసలు కారణం ఇదే అంటున్నారు నిపుణులు.
అలాగే శరీరక వ్యాయామాలు లేకపోతే కూడా గుండె ప్రమాదంలో పడుతుంది. అందుకే ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు వ్యాయామం చేయండి.