కిడ్నీల ఆరోగ్యం దెబ్బ తినడానికి ఈ పొరపాట్లే కారణం.. అవేంటో తెలుసుకోండి!

First Published Jul 2, 2022, 2:35 PM IST

ప్రస్తుత కాలంలో చాలామంది కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీల ఆరోగ్యం (Kidney health) బాగుంటే శరీర ఆరోగ్యం బాగుంటుంది.
 

కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను (Body waste) బయటకు పంపించి శరీరాన్ని శుభ్రపరుస్తాయి. శరీరంలో ఏ అవయవాన్ని అయినా తిరిగి రిపేరు చేయవచ్చు కానీ కిడ్నీలు ఒకసారి దెబ్బతిన్నాయంటే వాటిని తిరిగి రిపేర్ చేయలేము. కనుక వాటి ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మరి కిడ్నీ సమస్యలు తలెత్తడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 
 

కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మూత్ర విసర్జన సమస్యలు (urinary problems), కిడ్నీలో రాళ్లు (Kidney stones) ఏర్పడతాయి. కిడ్నీలు శరీరంలో ఉన్న ఐదు లీటర్ల రక్తాన్ని గంటకు రెండుసార్లు ఫిల్టర్ చేస్తాయి. ఇవి 24 గంటలు పనిచేస్తూ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి రక్తంలో ఉండే యూరియా, క్రియాటిన్, వ్యర్థాలను బయటకు పంపించడానికి సహాయపడతాయి. అయితే కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు వ్యర్థాలు బయటకుపోకుండా రక్తంలోనే ఉండిపోతాయి.
 

కిడ్నీలు రెండు చెడిపోవడానికి ప్రధాన కారణం మధుమేహం (Diabetes). రక్తంలో చక్కెర శాతం అధికంగా ఉన్నప్పుడు దాని ప్రభావం కిడ్నీలపై పడుతుంది. ఫలితంగా రక్తంలోని చక్కెర కిడ్నీలలోకి చేరి రక్తనాళాలు గట్టిపడటం, రక్త ప్రసరణ తగ్గడంతో కిడ్నీలలో ఉండే ఫిల్టర్లు (Filters) దెబ్బతింటాయి. దీంతో కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది. మధుమేహ తీవ్రత పెరిగే కొద్దీ కిడ్నీల ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. దీంతో కిడ్నీల జీవితకాలం తగ్గుతుంది.
 

కిడ్నీల ఆరోగ్యాన్ని పాడుచేసే మరో ముఖ్య సమస్య అధిక రక్తపోటు (High blood pressure). అధిక రక్తపోటు కారణంగా కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ దెబ్బతింటాయి. దీంతో రక్త ప్రసరణ వ్యవస్థ మరింత దెబ్బతిని రక్త ప్రసరణ సాఫీగా జరగదు. దీంతో కిడ్నీలకు వెళ్లే రక్త ప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా కిడ్నీలో ఉండే రక్తనాళాలు (Blood vessels) దెబ్బతింటాయి. దీంతో కిడ్నీల సమస్య ఏర్పడుతుంది. కనుక అధిక రక్తపోటు సమస్యలకు దూరంగా ఉండాలి.
 

శరీరంలో ఉండే బ్యాక్టీరియా కిడ్నీల ఇన్ఫెక్షన్లకు (Kidney infection) దారితీస్తుంది. దీంతో కిడ్నీల ఫిల్టర్స్ దెబ్బతింటాయి. ఇలా ఎంతోమంది చిన్న వయసులోనే కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు కారణం వారి జీవన శైలిలోని చెడు అలవాట్లు, సరైన ఆహార ప్రణాళిక లేకపోవడం. దీంతో కిడ్నీల సమస్య (Kidney problem) చిన్న వయసులోనే తలెత్తుతుంది. కిడ్నీలు బాగా పాడైపోతే మళ్లీ అది ఆరోగ్యంగా మారే అవకాశం ఉండదు.
 

కనుక వాటి ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకుంటూ, మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే కిడ్నీలను పాడు చేసే మరో ఆయుధం ఉప్పు (Salt). ఉప్పును రుచి కోసమే వాడాలి. అలాకాకుండా అధిక మొత్తంలో తీసుకుంటే కిడ్నీలలోని ఫిల్టర్స్ దెబ్బతింటాయి. కనుక కిడ్నీ సమస్యతో బాధపడేవారు ఉప్పుకు దూరంగా ఉంటూ   మాంసాన్ని (Meat) కూడా తీసుకురాదు.
 

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో నాలుగు లీటర్ల నీటిని (Water) తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తీసుకుంటే మూత్ర విసర్జన సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్ధాలు తేలికగా బయటకు విసర్జింపబడుతాయి. దీంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే మొలకెత్తిన గింజలు (Sprouted seeds), పండ్లు, జ్యూస్ లు, సలాడ్స్, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

click me!