చలికాలంలో చర్మం పొడిబారకూడదంటే ఇలా చేయండి

First Published Nov 22, 2022, 9:54 AM IST

చలికాలంలో చర్మంపై మచ్చలు, పొడిబారడం వంటి సమస్యలు రావడం చాలా కామన్. కానీ వీటివల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. అందం కూడా తగ్గుతుంది. అయితే కొన్ని ప్రత్యేక చిట్కాలను ఫాలో అయితే చర్మం పొడిబారకుండా ఉంటుంది. 
 

ఇతర కాలాలతో పోల్చితే శీతాకాలంలోనే చర్మం ఎక్కువగా పొడిబారుతుంటుందది. ఉష్ణోగ్రత, తేమ కారణంగా చర్మం ఇలా అవుతుంది. ఒక్కరిద్దరు కాదు ఈ సీజన్ లో చాలా మంది డ్రై స్కిన్ తో ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు. అవేంటంటే..

స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ 

వేసవి, వసంత కాలాల్లో మీ ముఖాన్ని యవ్వనంగా ఉంచడానికి ఉపయోగించే చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఈ చలికాంలో మీ చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ సీజన్ లో ముఖాన్ని, చర్మాన్ని శుభ్రం చేయడానికి బార్ లేదా ద్రవరూపంలో ఉండే తేలికపాటి , అధిక ఫ్యాట్, సువాసన ఎక్కువగా లేని సబ్బులనే ఉపయోగించండి. సూపర్ ఫ్యాటెడ్ అనేది మీరు ఉపయోగించే సబ్బులో ఎంత నూనెలు  ఉన్నాయో తెలుపుతుంది. అయితే ఆస్ట్రింజెంట్ కానీ టోనర్ ను ఉపయోగిస్తే మంచిది. లానోలిన్, గ్లిసరిన్ లేదా మినరల్ ఆయిల్ ఉండే మాయిశ్చరైజర్లు డ్రై స్కిన్ ను తొలగించడానికి సహాయపడతాయి. 
 

వేడి వాటర్ ను ఉపయోగించకండి

బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి నీళ్లను, హాట్ షవర్ బాత్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇవి చర్మానికి హాని చేస్తాయి. నిజానికి బయట చల్లగా ఉంది కాబట్టి వేడినీళ్లతో స్నానం మంచిదని నమ్ముతారు. కానీ మరీ వేడిగా ఉండే నీటిని ఉపయోగించడం వల్ల మీ చర్మం పొడిబారుతుంది. వేడినీటి వల్ల చర్మంపై ఉండే సహజ నూనెలు తగ్గుతాయి. చర్మం కూడా పొడిగా మారుతుంది. అయితే ఈ సీజన్ లో మరీ పొగలు కక్కే నీటికి బదులుగా గోరువెచ్చని నీటినే ఉపయోగించండి. 

మాయిశ్చరైజ్ చేయండి

మీరు చేతులను, ముఖాన్ని లేదా శరీరాన్ని కడిగినప్పుడల్లా చర్మం దాని సహజ నూనెలను (సెబమ్ ను) కోల్పోతుంది. ఈ నూనెలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవి చర్మంపై తేమను నిల్పడానికి సహాయపడతాయి. అందుకే కడిగిన ప్రతిసారి ఆ వెంటనే చర్మాన్ని హైడ్రేట్ చేయాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో. ముఖం కడిగిన ప్రతిసారి మాయిశ్చరైజర్ ను ఉపయోగించండి. బయటకు ఎక్కడికైనా ప్రయాణించినా.. చిన్న సైజు మాయిశ్చరైజర్ బాటిల్ ను వెంటనే తీసుకెళ్లండి. 

స్నానం చేసిన ప్రతిసారి మాయిశ్చరైజ్ చేయండి

స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజరర్ ను చర్మానికి పక్కాగా అప్లై చేయండి. ఇది మీ చర్మం అప్పుడే శోషించుకున్న నీటిపై పట్టుకోవడానికి సహాయపడుతుంది. హైలురోనిక్ యాసిడ్ లేదా గ్లిసరిన్ ఆధారంగా మాయిశ్చరైజర్ మీ చర్మం ద్వారా శోషించుకోబడే నీటి పరిమాణాన్ని పెంచుతుంది. బేబీ ఆయిల్ కూడా మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది తేమ తగ్గకుండా చూస్తుంది. రోజులో మాయిశ్చరైజర్ ను తరచుగా అప్లై చేస్తూ ఉండండి. ముఖ్యంగా డ్రైస్కిన్ ప్లేస్ లో. 
 

సన్ స్క్రీన్ ఉపయోగించండి

అయితే ఈ కాలంలో సూర్యకాంతి తక్కువగా ఉండటంతో చాలా మంది సన్ స్క్రీన్ ను ఉపయోగించడం మొత్తమే మానేస్తుంటారు. కానీ దీనివల్ల చర్మ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. శీతాకాలంలో కూడా హానికరమైన యువి కిరణాలు చర్మంపై పడతాయి. దీంతో చర్మం ఒత్తిడికి గురవుతుంది. అందుకే ఈ సీజన్ లో ఉదయం పూట మాయిశ్చరైజర్ ను అప్లై చేసిన తర్వాత సన్ స్క్రీన్ ను కూడా చర్మానికి పెట్టండి.  

click me!