పిల్లలకు పాలలో ఇవి కలిపి ఇవ్వకండి

First Published Feb 3, 2023, 1:13 PM IST

పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలకు చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకునే శక్తి ఉండదు. ఎందుకంటే వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. 
 

Image: Freepik

వట్టి పాలను తాగడమే బెటర్. పాలలో ఇష్టమైన దానిని కలుపుకుని తాగితే కొన్ని కొన్ని సార్లు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తల్లుల్లు పిల్లలు తాగే పాలలో కొన్నింటిని కలిపి ఇస్తే వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవి ఆరోగ్యకరమైనవే కావొచ్చు. కానీ పాలలో కలపకపోవడమే మంచిది. 
 

kids food

పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముందే పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. చిన్న సమస్యలైనా పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే పిల్లలకు ఫుడ్ పెట్టేముందు ఇది వారికి మంచి చేస్తుందా?  చెడు చేస్తుందా? అన్న సంగతిని తెలుసుకోండి. పిల్లలకు పాలలో ఎలాంటి ఆహారాలను కలిపి ఇవ్వకూడదు? ఒకవేళ ఇస్తే ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు  తెలుసుకుందాం.. 

పాలలో తప్పుడు  ఆహారాలను మిక్స్ చేయడం వల్ల పిల్లలకు వచ్చే సమస్యలు

అజీర్థి

గ్యాస్ ప్రాబ్లమ్

వికారం, వాంతి వచ్చేలా ఉండటం

కోలిక్

వాంతులు
 

strawberry milkshake

పాలు, సిట్రస్ పండ్లు

నారింజ, నిమ్మకాయలు, టాన్జేరిన్, టమోటాలు, చింతపండు వంటి సిట్రిక్ ఆహారాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లను పాలలో కలిపితే పాలు విరిగిపోతాయి. అయితే పాలు తాగిన వెంటనే కూడా ఈ పండ్లను తినకూడదు.  కనీసం ఈ రెండు ఆహారాల మధ్య గంట గ్యాప్ ఉండాలి. 

అరటిపండ్లు, పాలు

పిల్లలు, పెద్దలు అంటూ పాలు, అరటిపండ్ల కాంబినేషన్ ను బాగా ఇష్టపడతారు. ఇది టేస్టీగా అనిపించినా.. ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం.. అరటిపండ్లు పాల కలియిక మన శరీరంలో విష పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ కలయిక బద్దకస్తులను చేస్తుంది. దీనివల్ల మనస్సు చురుగ్గా ఉండదు. అరటిపండ్లు, పాల కలయిక కూడా నిద్ర విధానాలను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంటే దీనివల్ల నిద్ర సరిగ్గా రాదు. పిల్లలకు నిద్ర ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. 

పాలు, ద్రాక్ష

ద్రాక్ష పండ్లను కూడా పాలలో కలపకూడదంటున్నారు నిపుణులు. ఈ పండ్లను పాలలో కలపడం వల్ల పాల ప్రోటీన్ గట్టిపడుతుంది. ఇది జీర్ణశయాంతర నొప్పి, విరేచనాలకు కారణమవుతుంది.
 

పండ్లు, పెరుగు

ఈ అలవాటు చాలా మందికే ఉంటుంది. పండ్లు, పెరుగు కలయికను చాలా మంది ఇష్టపడతారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అయితే చాలా మంది తల్లులు తమ పిల్లలకు ప్యాకేజ్డ్ ఫ్రూట్ పెరుగును పెడుతుంటారు. ఇది పిల్లల ఆరోగ్యానికి మరింత హానికరం. ఎందుకంటే దీనిలో పండ్లు, పెరుగు ఉండటమే కాదు చాలా ప్రిజర్వేటివ్ లు కూడా ఉంటాయి. ఇది పిల్లలను అనారోగ్య సమస్యల బారిన పడేస్తుంది. అందుకే పిల్లలకు పాలలో వీటిని మిక్స్ చేసి ఇవ్వకండి. 

click me!