Glowing Skin Tips: ఖరీదైన క్రీములతో పనిలేదు.. రాత్రిపూట ఈ 5 టిప్స్ పాటిస్తే ఫేస్ లో గ్లో పక్కా!

Published : Jun 02, 2026, 06:10 PM ISTUpdated : Jun 02, 2026, 06:14 PM IST

Glowing Skin Tips: ప్రతి ఒక్కరూ అందమైన, మెరిసే ముఖాన్ని కోరుకుంటారు. అందుకోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ రాత్రి నిద్రపోయే ముందు చేసే ఈ 5 టిప్స్ పాటిస్తే కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా..

PREV
16
ఫేస్ లో గ్లో పెంచే చిట్కాలు

మనలో చాలామంది అందమైన, కాంతివంతమైన చర్మం కోసం ఖరీదైన క్రీములు, ఫేషియల్స్, బ్యూటీ ట్రీట్‌మెంట్లపై ఆధారపడుతుంటారు. కానీ నిపుణుల ప్రకారం నిజమైన అందం బయట నుంచి కాదు.. లోపలి నుంచి వస్తుంది. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు పాటించే కొన్ని మంచి అలవాట్లు ముఖానికి మరింత గ్లో తెచ్చిపెడతాయి. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
ముఖాన్ని శుభ్రం చేసుకోవడం

నిద్రపోయే ముందు ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. రోజంతా బయట తిరగడం వల్ల కాలుష్యం, దుమ్ము, దూళి, చెమట, మేకప్ అవశేషాలు చర్మ రంధ్రాల్లో పేరుకుపోతాయి. వీటిని అలాగే వదిలేస్తే మొటిమలు, బ్లాక్‌హెడ్స్, చర్మం మసకబారడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే రాత్రి పడుకునే ముందు మృదువైన ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల రాత్రి సమయంలో జరిగే కణాల పునరుద్ధరణ ప్రక్రియ మరింత సమర్థంగా జరుగుతుంది.

36
సరిపడా నీరు తాగడం

చాలామంది రోజంతా నీరు తాగినా, రాత్రి సమయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే నిద్రకు గంట ముందు ఒక గ్లాస్ నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శరీరంలో తగినంత తేమ ఉండటం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. నిపుణుల ప్రకారం, డీహైడ్రేషన్ కారణంగా చర్మం కాంతి కోల్పోయి అలసటగా కనిపిస్తుంది. అందుకే రాత్రి సమయంలో కూడా శరీరానికి అవసరమైన నీటిని అందించడం ముఖ్యం.

46
మాయిశ్చరైజర్ లేదా నైట్ క్రీమ్

రాత్రి సమయంలో చర్మం రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో చర్మానికి తగినంత తేమ అందించడం వల్ల అది మరింత ఆరోగ్యంగా మారుతుంది. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవారు నిద్రకు ముందు మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చర్మానికి సరిపోయే ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది.

56
డిజిటల్ స్క్రీన్‌లకు దూరం

ప్రస్తుత కాలంలో చాలామంది నిద్రపోయే వరకు మొబైల్ ఫోన్ చూస్తూనే ఉంటారు. అయితే స్క్రీన్‌ల నుంచి వచ్చే బ్లూ లైట్ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గిపోతుంది. సరైన నిద్ర లేకపోతే కళ్ల కింద డార్క్ సర్కిల్స్, ముఖంపై అలసట స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల నిద్రకు కనీసం అరగంట నుంచి గంట ముందు వరకు మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌ల వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

66
ప్రశాంతమైన నిద్ర

ఎంత ఖరీదైన క్రీములు వాడినా, సరైన నిద్ర లేకపోతే చర్మం ఆరోగ్యంగా కనిపించదు. సాధారణంగా పెద్దవారికి రోజుకు 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. నిద్ర సమయంలో శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా, యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే కణాల పునరుద్ధరణ కూడా వేగంగా జరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories