మీకు థైరాయిడ్ ఉందా? అయితే కొత్తమీరను తప్పకుండా తినండి

First Published Jan 31, 2023, 3:56 PM IST

ఏమో అనుకుంటాం కానీ.. మనం తినే కొన్ని ఆహారాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఇట్టే తగ్గిస్తాయి. ఇలాంటి వాటిలో కొత్తిమీర ఒకటి. ఈ కొత్తమీర థైరాయిడ్ ఉన్నవాళ్లకు చాలా చాలా మంచిది. ఎందుకంటే..? 

థైరాయిడ్ అనేది గొంతులో ఉండే ఒక చిన్న ఎండోక్రైన్ గ్రంథి. ఎండోక్రైన్ గ్రంథులు పెరుగుదల, అభివృద్ధి, జీవక్రియ, సంతానోత్పత్తితో సహా అనేక శరీర విధులను నియంత్రించడానికి సహాయపడతాయి. అయితే థైరాయిడ్ గ్రంథి హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ.. గుండె, మెదడు, కాలేయం, మూత్రపిండాలు, వాస్కులర్ (రక్తనాళాలు) వ్యవస్థలు, రక్తపోటు, జీర్ణవ్యవస్థ, జీవక్రియ పెరుగుదల, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  థైరాయిడ్ సమస్యలు హైపర్ థైరాయిడిజం,  హైపోథైరాయిడిజం అని రెండు రకాలుగా ఉంటాయి. ఏ సమస్యనైనా సరే కొత్తిమీర ఇట్టే తగ్గిస్తుంది. కొత్తిమీర కేవలం వాసనకు మాత్రమే ప్రసిద్ది చెందలేదు. దీనిలో జీర్ణక్రియకు సహాయపడే, ఉబ్బరాన్ని తగ్గించే సహజ లక్షణాలు కూడా ఉన్నాయి. 

సాధారణంగా హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఉన్నవారు ధనియాలను తినాలని నిపుణులు సలహానిస్తుంటారు. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి. థైరాయిడ్ తో బాధపడేవారికి కొత్తిమీర, ఆకులు, కొత్తిమీర నీళ్లు అద్భుతాలు చేస్తాయి.

Coriander Leaves

కొత్తిమీర ప్రయోజనాలు

థైరాయిడ్ సమస్యను తగ్గించే ఉత్తమ ఆహారాలలో కొత్తిమీర ఒకటి. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కొత్తి మీర ఆకుల్లో .. విత్తనాల కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. కొత్తిమీర ఆకుల్లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ద్వారా కణాలను దెబ్బతినకుండా రక్షించడానికి సహాయపడతాయి. థైరాయిడ్ సమస్యలను తగ్గించడానికి సాంప్రదాయ వైద్యంలో కొత్తిమీరను ఎక్కువగా ఉపయోగిస్తారు. 
 

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు

కొత్తిమీరను ఎక్కువగా వంటలపై గార్నిష్ చేయడానికి ఉపయోగిస్తుంటారు. నిజానికి కొత్తమీరలో ఎన్నో  ఔషదగుణాలుంటాయి. అందుకే కొత్తిమీర విత్తనాలను దశాబ్దాలుగా ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఏదేమైనా విత్తనాల రుచి కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ విత్తనాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి థైరాయిడ్ వంటి వ్యాధులు లేదా రుగ్మతల నుంచి మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి.

కొలెస్ట్రాల్ నిర్వహణ

థైరాయిడ్ ఎన్నో వ్యాధులతో సంబంధం కలిగి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు థైరాయిడ్ కారణంగా కొత్త కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. థైరాయిడ్ కు ప్రధాన కారణం మన శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ (టిసి) స్థాయి పెరగడం. అయితే కొత్తిమీర విత్తనాల సహాయంతో శరీరంలో పెరిగిపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. ఇది థైరాయిడ్ హార్మోన్లను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Coriander water

బరువు తగ్గడం

ధనియా వాటర్ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజూ కొత్తిమీర ఆకులను తినడం వల్ల థైరాయిడ్ సమస్యలు తగ్గిపోవడంతో పాటుగా బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే థైరాయిడ్ కు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవడానికి కేవలం కొత్తిమీరపైనే ఆధారపడకూడదని నిపుణులు చెబుతున్నారు. మీ జీవనశైలిని మెరుగుపరచడంపై కూడా దృష్టి పెట్టండి.

కొత్తిమీర ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

కొత్తిమీర నీటిని తాగడం వల్ల  కీళ్ల తిమ్మిరి, వాపు తగ్గడంతో పాటుగా ఆర్థరైటిస్ లక్షణాలు తగ్గిపోతాయి. 
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టును చిక్కగా చేస్తుంది.
కొత్తిమీరలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రాడికల్ సెల్ డ్యామేజ్ నుంచి కణాలను రక్షిస్తుంది.
కొత్తిమీర విత్తనాలను తరచుగా జీర్ణ సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలు తొందరగా తగ్గిపోతాయి.
బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

కొత్తిమీర తినడానికి ఉత్తమ మార్గాలు

1. కొత్తిమీర టీ:  ముందుగా 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర గింజలను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి 10 నుంచి 15 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించండి. ఈ తర్వాత వడకట్టండి. ఈ టీని ఉదయాన్నే పరగడుపున తాగితే మంచి ప్రయోజనాలను పొందుతారు. కావాలనుకుంటే మీరు ఈ టీలో తేనెను కూడా కలుపుకోవచ్చు. మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందాలనుకుంటే కొత్తిమీర విత్తనాలను ఉడకబెట్టే ముందు కొన్ని నిమిషాలు నానబెట్టొచ్చు.

2. కొత్తిమీర నీరు

15 నుంచి 20 కొత్తిమీర ఆకులను తీసుకుని మంచిగా కడిగి రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగండి. రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని దీనిలో కలపొచ్చు. 
 

3. కొత్తిమీర ఆకు పానీయం

కొన్ని కొత్తిమీర ఆకులను తీసుకుని మంచిగా కడిగి  బ్లెండర్ లో వేయండి. ఆ తర్వాత దీనికి అరకప్పు నీళ్లు, నిమ్మరసం, తేనె కలుపుకుంటే అదనపు ప్రయోజనాలను పొందుతారు. ఈ తాజా జ్యూస్ ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలి. 

click me!