చలికాలంలో చుండ్రును తగ్గించే ఎఫెక్టీవ్ చిట్కాలు మీ కోసం..

First Published Jan 23, 2023, 1:55 PM IST

చలికాలంలో చుండ్రు మరింత ఎక్కువవుతుంది. అయితే కొన్ని చిట్కాలతో  ఈ చుండ్రును శాశ్వతంగా వదిలించుకోవచ్చు. అదెలాగంటే.. 
 

dandruff

ఈ రోజుల్లో చుండ్రు, జుట్టుకు సంబంధించిన సమస్యలు సర్వ సాధారణ సమస్యలుగా మారిపోయాయి. చుండ్రు వల్ల చర్మంపై దురద పెడుతుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే.. చుండ్రు అనేది ఒక శోథ రహిత, దీర్ఘకాలిక పరిస్థితి. ఇది నెత్తిమీదికి సంబంధించిన అత్యంత సాధారణ చర్మవ్యాధి. దీనిని చర్మ సమస్యగా పరిగణిస్తారు. దీనివల్ల నెత్తిమీది కణజాలం బాగా ప్రభావితమవుతుంది.

చుండ్రుకు కారణాలెన్నో ఉంటాయి. కానీ జిడ్డు గల నెత్తిమీద, ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారితీసే పేలవమైన పరిశుభ్రత, సెబోర్హీక్ చర్మశోథ, జుట్టు ఉత్పత్తులు, నెత్తిమీద నివసించే ఒక నిర్దిష్ట రకం ఫంగస్ పెరుగుదల వంటి వివిధ కారణాల వల్ల చుండ్రు ఏర్పడుతుంది. అయితే ఈ చుండ్రును పూర్తిగా తగ్గించడానికి కొన్ని ఎఫెక్టీవ్ టిప్స్ ఉన్నాయి. అవేంటంటే.. 
 

dandruff

చుండ్రును ఎదుర్కోవడం కష్టతరమైన సమస్య అయినప్పటికీ వివిధ రకాల సహజ నివారణలు కూడా చుండ్రును తగ్గిస్తాయి. చుండ్రు నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కెమికల్స్ ఉన్న వాటి కంటే సహజ నివారణా పద్దతులే మంచి మేలు చేస్తాయి. జుట్టును కాపాడుతాయి. చుండ్రు వల్ల వచ్చే మంటను కూడా తగ్గిస్తాయి. అంతేకాదు ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.

dandruff

వేప సారం

వేప నెత్తిని శుభ్రం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది కూడా. అంతేకాదు మూసుకుపోయిన రంధ్రాలను క్లియర్ చేస్తుంది. వేపలో ఉండే లక్షణాలు చుండ్రును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇందుకోసం వేప ఆకు సారాన్ని నెత్తికి బాగా అప్లై చేసి కొద్ది సేపు గోరువెచ్చని నీటితో కడగండి.
 

పెరుగుతో ఉసిరి పొడి

ఇండియన్ గూస్ బెర్రీగా పిలువబడే ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి పొడి చుండ్రును వదిలించడానికి బాగా సహాయపడుతుంది. మరోవైపు పెరుగులో ఈస్ట్ ను అదుపులో ఉంచే 'ఫ్రెండ్లీ బ్యాక్టీరియా' ఉంటుంది. చుండ్రును వదిలించుకోవడానికి 2 టీస్పూన్ల ఉసిరి పొడిని తీసుకుని పెరుగులో మిక్స్ చేసి తలకు అప్లై చేయండి. 
 

ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడి మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. చుండ్రుకు కారణమయ్యే అంటువ్యాధులతో పోరాడే మీ శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది కూడా. ఒత్తిడి వల్ల కూడా తరచుగా చుండ్రు ఏర్పడుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి నడక లేదా యోగా, ధ్యానం చేయండి. 
 

click me!