పొట్ట పెరిగే కొద్ది గుండెపోటు ముప్పు పెరుగుతుంది జాగ్రత్త..

Published : Sep 03, 2022, 10:21 AM IST

యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీలో సమర్పించిన ఓ పరిశోధన నివేదిక ప్రకారం.. ఇతరులతో పోల్చితే ఎవరి పొట్ట అయితే  పెద్దగా ఉంటుందో.. వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 3.21 రెట్లు ఎక్కువ ఉన్నట్టు వెల్లడైంది.

PREV
111
పొట్ట పెరిగే కొద్ది గుండెపోటు ముప్పు పెరుగుతుంది జాగ్రత్త..

పొత్తి కడుపులో వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుందన్న విషయం అందరికీ తెలుసు.. దీనివల్ల స్థూలకాయంతో పాటుగా ఎన్నో ప్రమాదకరమైన రోగాలు తలెత్తుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నడుము పరిమాణం పెరిగే  ప్రతి అంగుళానికి గుండెపోటు ముప్పు 10 శాతం పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.
 

211

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీలో సమర్పించిన ఈ పరిశోధన నివేదిక ప్రకారం.. బెల్లీ ఫ్యాట్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం 3.21 రెట్లు ఎక్కువ అని తేలింది. 

311

ఈ అధ్యయనం ప్రకారం.. ఇతరులతో పోల్చితే అధిక బరువు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 2. 65 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అంతేకాదు ఇది ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. 
 

411
belly fat

కార్భోహైడ్రేట్లు, కొవ్వు, చక్కెరలను ఎక్కువగా తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. అందుకే వీటిని తగ్గించండి. మీ ఆహారంలో కేలరీలు, ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చండి. ఇవి బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయి. 

511

బెల్లీ ఫ్యాట్ ను తగ్గించే చిట్కాలు..

అన్నం

బరువు తగ్గాలనుకునే  వైట్ రైస్‌ను ఎక్కువగా తినడం మానేయాలి. ఎందుకంటే బియ్యంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే అన్నాన్ని ఎక్కువగా తినకండి. మీ ప్లేట్ లో పావు వంతు అన్నం ఉంటే.. మిగతాది సలాడ్ లేదా ఇతర వెజ్ వంటకాలు ఉండేట్టు చూసుకోండి. 
 

611

చక్కెర

చక్కెర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల మీరు వేగంగా బరువు పెరుగుతారు. ఇది జీవక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది కూడా. అందుకే షుగర్ వాడకాన్ని తగ్గించండి. 

711

రాత్రిపూట ఆలస్యంగా తినడం

రాత్రిపూట ఆలస్యంగా తింటే కడుపు ఉబ్బరం పెరుగుతుంది. ముఖ్యంగా ఆలస్యంగా తినడం.. ఆ వెంటనే పడుకోవడం వల్ల శరీరంరలో కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది.  అందుకే పడుకునే ముందు ఒక అర్థగంట పాటైనా నడవండి. ఇది కొవ్వు కరిగిపోవడానికి సహాయపడతుంది. 
 

811

శీతల పానీయాలు

శీతల పానీయాలు కూడా బరువును పెంచుతాయి. వీటిని తరచుగా తాగడం వల్ల ఊబకాయం, విసెరల్ కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుందని ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి కూడా.. ఎందుకంటే శీతల పానీయాల్లోని ఫ్రక్టోజ్ ఈ సమస్యలకు దారితీస్తుంది. ఈ ఫ్రక్టోజ్ నేరుగా కాలేయానికి వెళ్లి కొవ్వుగా మారుతుంది. అలాగే ఈ పానీయాల్లో ఉండే చక్కెర బరువును ఫాస్ట్ గా పెంచుతుంది. ఈ అదనపు కొవ్వు జీవక్రియ వ్యాధి కూడా దారితీస్తుంది. 

911

నీరు

నీరు ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఓవర్ వెయిట్ ఉన్నవారు నీటిని పుష్కలంగా తాగితే బరువు తగ్గుతారు. అందుకే మీరు తినే ముందు నీటిని తాగండి. దీనివల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల మీరు ఎక్కువ ఫుడ్ ను తినలేరు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 

1011
fiber

ఫైబర్

ఫైబర్ కంటెంట్ కూడా బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే మీరు తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువమొత్తంలో ఉండేట్టు చూసుకోండి. ఫుడ్ ఫైబర్ ఫుడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ ఫైబర్ ఫుడ్ మీ కడుపును తొందరగా నిండేలా చేస్తుంది. అలాగే తొందరగా ఆకలి కాకుండా చేస్తుంది. 
 

1111

వీటితో పాటుగా తినడం, కూర్చోవడమే కాకుండా... రోజులో కొద్ది సేపు వ్యాయామం చేయండి. ఇది కేలరీలను కరిగించడానికి సహాయపడతుంది.  ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లకు కూడా దూరంగా ఉండండి. ధ్యానం ఈ అలవాట్ల ను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories