
ఈ రోజుల్లో చిన్న వయసు వారు కూడా అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బీపీ పెరిగితే ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అందుకే దీన్ని కంట్రోల్ లోనే ఉంచుకోవాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను అధిక రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి..
వేరుశెనగలు
వేరుశెనగలను ఇష్టపడని వారుండరు. ఇవి టేస్టీగానే కాదు.. ఈ గింజల్లో ఎన్నో ఔషదగుణాలున్నాయి. అందుకే వీటి ధర మార్కెట్ లో కాస్త ఎక్కువగా ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు వేరువెనగ గింజలు తినడం వల్ల మీ శరీరం సక్రమంగా పనిచేస్తుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా తొలగిపోతుంది.
మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే .. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అధిక బరువు, డయాబెటీస్ వంటి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి వారు గుప్పెడు వేరుశెనగ గింజలను తినడం వల్ల ఇలాంటి రోగాల ప్రమాదం తప్పుతుంది. ఎందుకంటే ఈ గింజలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తొలగించడానికి సహాయపడుతాయి.
బాదం పలుకులు కూడా శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తొలగించేందుకు సహాయపడతాయి. మీకు తెలుసా..? క్రమంతప్పకుండా గుప్పెడు వేరుశెనగలు మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే మంచిది. ఈ నానబెట్టిన గింజలు డయాబెటీస్ ను అదుపులో ఉంచుతాయి. బాదం పలుకులను కూడా ఇలాగే తింటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.
అయితే వెయిట్ ఎక్కువగా ఉన్న వారు నట్స్ ను దూరం పెడుతుంటారు. ఎక్కడ వీటిని తింటే మరింత బరువు పెరిగిపోతామేమోనని. కానీ అది తప్పుడు ఆలోచన. ఎందుకంటే వేరుశెనగలను తింటే బరువు పెరగరు. ముఖ్యంగా ఇవి మీ శరీర బరువు మరింత పెరగకుండా అడ్డుకుంటాయి కూడా.
వీటిని తినడం వల్ల మీ శరీర బలం పెరుగుతుంది. వేరుశెనగల్లో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ వేరుశెనగలను తినడం వల్ల మీ బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఈ గింజలు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
జీడిపప్పులు
జీడిపప్పులు తింటే బరువు పెరిగిపోతామని వీటిని ముట్టని వారు చాలా మందే ఉన్నారు. నిజానికి అదంతా అబద్దం.. నిజమేంటంటే.. ఇది మీ బరువును పెంచడానికి బదులుగా.. బరువును కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో 2 నుంచి 3 జీడిపప్పులను తినడం శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే శరీర శక్తిని కూడా పెంచుతుంది. వీటిలో పిస్తాపప్పు ఇతర గింజల కంటే ఎక్కువ పోషకాలుంటాయి. ఇది రుచిగానే కాదు.. మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఈ గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక బరువు కూడా తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా కంట్రోల్ లో ఉంటాయి.
బాదం
బాదం లేదా వేరుశెనగ పప్పులను పడుకునే ముందు నానబెట్టి ఉదయాన్నే తినండి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ ఇ ,మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతాయి. సమస్యలు కూడా అదుపులో ఉంటాయి.