ఈ ఫుడ్స్ గుండెకు శత్రువులు.. వీటిని తిన్నారో.. మీకు గుండెపోటు రావడం ఖాయం..!

Published : Aug 22, 2022, 02:38 PM IST

ఆరోగ్యకరమైన గుండె: మన శరీరంలో గుండె ముఖ్యమైన అవయవం. ఇది సరిగ్గా కొట్టుకున్నన్ని రోజులే మనం ఆరోగ్యంగా ఉంటాం. వన్స్ ఇది కొట్టుకోవడం ఆగిపోతే మనం ఇకలేనట్టే.. అందుకే దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.  

PREV
16
ఈ ఫుడ్స్ గుండెకు శత్రువులు.. వీటిని తిన్నారో.. మీకు గుండెపోటు రావడం ఖాయం..!

మన దేశంలో హార్ట్ పేషెంట్స్ సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ఒకప్పుడు ఈ గుండె జబ్బులు మధ్యవయస్సులకు, వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు గుండె జబ్బుల బారిన యువత కూడా పడుతోంది. ఎంతో మంది యువకులు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే దీనికి మనం తీసుకునే ఆహారాలు కూడా ప్రధాన కారణమే అంటున్నారు నిపుణులు. 

26

ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలను, పానీయాలను విచ్చలవిడిగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోతుంది.  ఇది సిరల్లో అడ్డంకి కలిగిస్తుంది. దీంతో గుండెకు రక్తసరఫరా సరిగ్గా జరగదు. రక్తాన్నిగుండెకు చేరవేడానికి కొలెస్ట్రాల్ ను నెట్టాలి. ఈ ప్రాసెస్ లోనే అధిక రక్తపోటు బారిన పడతారు. ఇక దీని తర్వాత హార్ట్ ఎటాక్, ట్రిపుల్ వెసల్ డిసీజ్, కొరోనరరీ ఆర్టరీ డిసీజ్ వంటి ప్రాణాంతక రోగాలు వస్తాయి. ఇంతకీ గుండెకు ఏయే ఆహారాలు శత్రువులో ఇప్పుడు తెలుసుకుందాం.. 

36

సిగరెట్లు, ఆల్కహాల్

ఆల్కహాల్ ను మితిమీరి తాగడం, సిగరేట్లను ఎక్కువగా కాల్చడం వల్ల కాలెయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయన్న సంగతి చాలా మందికి తెలుసు. నిజానికి వీటివల్ల ఈ అవయవాలకే కాదు గుండెకు కూడా మంచిది కాదు. ఈ అలవాట్ల వల్ల హార్ట్ ఫెయిల్యూర్, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ చెడ్డ అలవాట్లను వీలైనంత తొందరగా విడిచిపెట్టాలి. 
 

46

శీతల పానీయాలు

చాలా మంది శీతల పానీయాలంటే పడి చచ్చిపోతుంటారు. అందులో సోడాను మరీ ఎక్కువగా తాగుతుంటారు. వీటిని తాగడం వల్ల రీఫ్రెష్ గా అనిపించినప్పటికీ.. ఇవి గుండెను ప్రమాదంలో పడేస్తాయి. వీటిని రెగ్యులర్ గా తాగే వారికి గుండెజబ్బులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది. 
 

56

ఆయిల్ ఫుడ్స్

దేశవ్యాప్తంగా ఎన్నో రకాల వంటకాలున్నా.. చాలా మంది మాత్రం ఆయిలీ ఫుడ్స్ నే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఆరోగ్యానికి మాత్రం మంచివి కావు. వీటిని తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ దారుణంగా పెరిగిపోతుంది. ఇక ఈ కొలెస్ట్రాల్ గుండెపోటుకు దారితీస్తుంది. అందుకే మీకు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను తినే అలవాటుంటే వెంటనే మానుకోండి. 
 

66

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రస్తుతం ప్రాసెస్ చేసిన మాంసాన్నే తినడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నిజానికి మాంసంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని తింటుంటారు. కానీ ప్రాసెస్ చేసిన మాంసంలో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీన్ని తినడం వల్ల అధిక రక్తపోటు సమస్య బారిన పడతారు. ఇక ఆ తర్వాత వచ్చే గుండెపోటును మీరు ఆపలేరు. 
 

Read more Photos on
click me!

Recommended Stories