అబ్బాయిలు జెలస్ ఫీలైతే... భలే బాగుంటుందే..!

First Published Aug 22, 2022, 1:51 PM IST

 వారి గురించి  ఆలోచించకుండా .. మీరు మరొకరితో సమయం గడుపుతున్నారు అని తెలిస్తే.. వారు జెలస్ తోపాటు.. పొసెసివ్ గా మారతారు. అతనికంటే ఎక్కువగా భావించే జీవితం మీకు ఉంది అనే విషయం అతనికి తెలిస్తే.. కచ్చితంగా జెలస్ ఫీలౌతారు.
 

అమ్మాయిలకు జెలసీ కాస్త ఎక్కువగా ఉంటుంది... తమ ప్రియుడు లేదంటే.. తమ భర్త.. ఇతరులకు ప్రయారిటీ ఇచ్చినా, కనీసం ఇతరుల వైపు కన్నెత్తి చూసినా తట్టుకోలేరు. వెంటనే జెలస్ ఫీలౌతుంటారు. అయితే... ఇదే జెలసీ.. అబ్బాయిలు పడితే భలే సరదాగా ఉంటుంది. నిజానికి తొందరగా అబ్బాయిలు.. తమ ప్రేయసి విషయంలో జెలస్ ఫీలవ్వరు. కానీ.. వారు మీ విషయంలో జెలస్ ఫీలవ్వడం.. వారిలో అభద్రతా భావం కలిగించడం లాంటివి చేస్తే చాలా సరదాగా ఉంటుంది. వారిలోని పొసెసివ్ నెస్ ని కూడా బయటపెట్టిన వారు అవుతారు. దాని కోసం మీరు ఇతరులతో ఎఫైర్లు పెట్టుకోవడం లాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఈ కింది చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది.
 

happy couple life

మీ పార్ట్ నర్ మీకు ఫోన్ చేసినప్పుడు లేదంటే.. మెసేజ్ చేసినప్పుడు వెంటనే రెస్పాండ్ అవ్వకూడదు. వారికి కాకుండా.. మీ స్నేహితులకు ప్రయారిటీ ఇవ్వాలి. వారిని కొద్ది సేపు పట్టించుకోనట్లుగా ప్రవర్తించాలి. వారి గురించి  ఆలోచించకుండా .. మీరు మరొకరితో సమయం గడుపుతున్నారు అని తెలిస్తే.. వారు జెలస్ తోపాటు.. పొసెసివ్ గా మారతారు. అతనికంటే ఎక్కువగా భావించే జీవితం మీకు ఉంది అనే విషయం అతనికి తెలిస్తే.. కచ్చితంగా జెలస్ ఫీలౌతారు.
 

చాలా మంది అమ్మాయిలు..ప్రేమలో పడిన తర్వాత.. పెళ్లి తర్వాత.. కేవలం తమ పార్ట్ నర్ కి మాత్రే విలువ ఇస్తారు. వారితో మాత్రమే సమయం గడుపుతారు. అయితే...మీ పార్ట్ నర్ తో మాత్రమే  మీ స్నేహితులతో కూడా సమయం గడపడం ముఖ్యం. మీరు తప్పనిసరిగా మీ స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. అత్యవసర పరిస్థితి తలెత్తితే తప్ప మీ నో కాల్ జోన్‌గా మార్చుకోవాలి. మీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండండి, సరదా చిత్రాలను పోస్ట్ చేయండి.
 

పురుషులు.. తమకు ఇతర అవసరాలు వచ్చిప్పుడు తమ భార్యలను పక్కన పెట్టేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అమ్మాయిలు కూడా అలానే చేయాలట. ఎక్కడికైనా వెళ్దామని మనం అడిగినప్పుడు వాళ్లు ఎలా కుదరదు అని చెబుతారో.. మనం కూడా అప్పుడప్పుడు అలా చెప్పాలట. అప్పుడప్పుడు అలా చేయడం వల్ల... వారు జెలస్ ఫీలయ్యే అవకాశం ఉంది.

couple

మీ పార్ట్ నర్ మిమ్మల్ని సరిగా పట్టించుకోనప్పుడు.. మీరు అతనితో చిలిపిగా ప్రవర్తించవచ్చు.  వారి స్నేహితులు అందంగా ఉంటారని మీరు ఒక్కసారి పొగిడారు అనుకోండి.. అసూయతో రగిలిపోతారు. వారు మీ పట్ల శ్రద్ద కోరుకోవాలి అనుకున్నప్పుడు.. ఇలా ప్రయత్నించవచ్చు. సరదాగా ఉంటుంది. మీరు వారిని పొగిడినప్పుడు.. వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదనే విషయం అర్థమౌతుంది.

click me!