షుగర్ పేషెంట్లకు ఈ ఆహారాలు విషంతో సమానం.. తిన్నారో మీ పని అంతే..!

First Published Aug 22, 2022, 1:51 PM IST

డయాబెటీస్ పేషెంట్లకు తీపి పదార్థాలు విషంతో సమానం. ఎందుకంటే వీటిని తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరిగిపోతాయి. అందుకే వీరు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. 


మధుమేహులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఏవి పడితే అవి తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఇది కాస్త గుండె జబ్బులు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ వంటి ప్రాంణాంతక రోగాలొస్తాయి. అందుకే మధుమేహులు ఆహారం విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. అయితే కొంతమంది మాత్రం ఇష్టమైన ఫుడ్స్ చూడగానే నోటిని నియంత్రించుకోలేకపోతుంటారు. దీనివల్ల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అయితే డయాబెటీస్ పేషెంట్లు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి వారికి విషంతో సమానం. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి. ఇంతకీ వీరు ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మధుమేహంతో బాధపడేవారు చాలా మంది నోటికి రుచిగా ఉండే వాటినే తింటుంటారు. అందులో ఒకటి పాలతో కలిపిన చాక్లెట్ సిరప్. ఇది రుచిగా ఉంటుందని తీసుకుంటారు. కానీ ఇది మధుమేహుల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే పాలలో చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్లి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లు దీనికి దూరంగా ఉండాలి. 
 

పెరుగు

పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. దీనిలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ప్రస్తుతం మార్కెట్ లో దొరికే పెరుగు అస్సలు మంచిది కాదు. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరుగుతాయి. అందుకే మార్కెట్ లో దొరికే పెరుగును తినకండి.
 

espressos

కాఫీ

కాఫీ తాగడం వల్ల తక్షణమే ఎనర్జిటిక్ గా అనిపించినప్పటికీ.. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే దీనిలో ఉండే కెఫిన్ రక్తపోటును పెంచడానికి దారితీస్తుంది. ఇక కొంతమందైతే ఫ్లేవర్డ్ కాఫీని ఇష్టంగా తాగుతుంటారు. కానీ దీనిలో ఎక్కువ మొత్తంలో షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లకు మంచిది కాదు. 

చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు

పండ్లలో మన  ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అందుకే వీటిని ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సలహానిస్తుంటారు. కానీ మధుమేహుల ఆరోగ్యానికి కొన్ని రకాల పండ్లు  అస్సలు మంచివి కావు. ముఖ్యంగా చక్కెర శాతం ఎక్కువగా ఉండే పండ్లు. ఈ పండ్లు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. పైనాపిల్, మామిడి పండులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
 

టొమాటో సాస్

చాలా మందికి టొమాటో సాస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇది రుచిగా ఉంటుంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గ్లూకోజ్ స్థాయిలను విపరీతంగా పెంచుతుంది. అందుకే దీన్ని తినకూడదు.  
 

click me!