గుండెపోటు తర్వాత తొందరగా కోలుకోవాలంటే ఇలా చేయండి..

Published : Dec 03, 2022, 10:50 AM IST

గుండెపోటు మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ ఎటాక్ నుంచి బయటపడిన తర్వాత తొందరగా కోలుకుంటారు. ఇందుకోసం..  

PREV
17
గుండెపోటు తర్వాత తొందరగా కోలుకోవాలంటే ఇలా చేయండి..

గుండెపోటు మన జీవితాన్ని ఎన్నో విధాలా ప్రభావితం చేస్తుంది. అందుకే గుండెపోటు బారిన పడ్డ చాలా మంది దీని నుంచి అంత సులువుగా బయటపడలేమని భావిస్తారు. నిజానికి గుండెపోటు వచ్చి యాంజియోప్లాస్టీ చేయించుకున్న చాలా మంది రోగులు 48 నుంచి 72 గంటల్లో డిశ్చార్జ్ అవుతారు. 1 నుంచి 2 వారాలలో వారు తిరిగి నార్మల్ లైఫ్ ను లీడ్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు తర్వాత తొందరగా రికవరీ కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

27

వ్యాయామం 

గుండె ఆరోగ్యానికి ఉత్తమ వ్యాయామం నడక. డిశ్చార్జ్ అయిన గుండెపోటు రోగులు ఒక వారం తర్వాత నడవడం మొదలుపెట్టాలి. మొదట్లో మెల్లగా నడుస్తూ.. వేగాన్ని పెంచొచ్చు. నడకతో పాటుగా యోగా, ధ్యానం వంటివి కూడా మీరు తొందరగా రికవరీ కావడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. క్రీడాకారులు, అథ్లెట్లు, మారథాన్ రన్నర్లు గుండెపోటు బారిన పడ్డ తర్వాత తొందరగా కోలుకోవడానికి నడక ఎంతో సహాయపడిందని నిరూపించబడింది. అయితే వీళ్లు కఠినమైన వ్యాయామం అసలే చేయకూడదు. 
 

37

సమతుల్య ఆహారం

పోషకాలు ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలు గుండెపోటు రోగులు త్వరగా కోలుకోవడానికి సహాయపతాయి. హార్ట్ పేషెంట్లు నూనె, ఉప్పును తక్కువగా తీసుకోవాలి. అలాగే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి. మాంసాహారులు అయితే.. కొంతకాలం రెడ్ మీట్ ను తినకపోవడమే మంచిది. చేపలు, సన్నని మాంసాన్ని మోతాదులో తినొచ్చు. 
 

47
health Checkup


క్రమం తప్పకుండా టెస్ట్ లు

గుండెపోటు నుంచి బయటపడ్డవారు కొన్ని ఆరోగ్య పరీక్షలను తప్పకుండా చేయించుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్, రక్తంలో చక్కెర, మూత్రపిండాల పనితీరు పరీక్షలు, ఎకో, టిఎంటీ, ఈసీజి టెస్ట్ లతో పాటుగా రెగ్యులర్ చెకప్ లను తప్పకుండా చేయించుకోవాలి. ఇవి ముందుల పనితీరును, ఏవైనా సమస్యలుంటే గుర్తించడానికి సహాయపడతాయి. గుండెపోటు తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో నొప్పి, చేతి నొప్పి, దవడ నొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. వీటికి సకాలంలో చికిత్స తీసుకుంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 
 

57

కౌన్సిలింగ్

డిశ్చార్జ్  సమయంలో కార్డియాక్, కార్డియాలజిస్ట్, డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్ తో సహా హార్ట్ కు సంబంధించిన డాక్టర్లతో కౌన్సిలింగ్ తీసుకోవడం మంచిది. ఇది కుంటుంబం తమపై విశ్వాసం, త్వరగా కోలుకోవడంపై నమ్మకాన్ని పెంచడానికి సహాయపడుతుంది. గుండెపోటు వచ్చిన రోగులు ఆరోగ్యవంతమైన జీవనశైలిని గడుపుతున్నప్పటికీ.. గుండెపోటు వచ్చిందని కలవరపడుతుంటారు. వీరి ఆంధోళనను పోగొట్టడానికి సహాయం తీసుకోవడం మంచిది. 
 

67

ప్రమాద కారకాలను నిర్వహించడానికి మందులు

హార్ట్ ఎటాక్ తర్వాత మరిన్ని సమస్యల ప్రమాదాలన్ని తగ్గించచుకోవడానికి డాక్టర్లు రాసిన మెడిసిన్స్ ను ఖచ్చితంగా ఉపయోగించాలి. మీ ఆరోగ్య తీరును బట్టి యాంటీథ్రోంబోటిక్స్, బీటా బ్లాకర్స్, స్టాటిన్స్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులు మళ్లోసారి గుండెపోటు రాకుండా చూస్తాయి. 
 

77

చివరిగా.. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం, మంచి నిద్ర, ఒత్తిడిని తగ్గించుకోవడం, జీవన శైలి అలవాట్లు, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ లు చేయించుకుంటే మీ గుండె మునపటిలా బలంగా తయారువుతుంది. దీనినుంచి త్వరగా కోలుకుంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


    

Read more Photos on
click me!

Recommended Stories