వీటిని తింటే మీ జుట్టు ఊడిపోవడం ఆగి.. ఒత్తుగా పెరుగుతుంది..

First Published Dec 2, 2022, 4:54 PM IST

నిజానికి శరీరంలో పోషకాల లోపంతో కూడా జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అందుకే శరీరంలో విటమిన్ల లోపం ఉండకూడదు. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే జుట్టు ఊడిపోవడం ఆగి.. మందంగా పెరుగుతుంది. 

hair

ఒత్తైన, నల్లని, ఆరోగ్యకరమైన జుట్టును ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. జుట్టు మనం కోరుకున్న విధంగా ఉండాలంటే దానికి కాస్త సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది జుట్టుకు కాస్త సమయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నారు. దీనివల్ల హెయిర్ ఫాల్, బట్టతల, తెల్లజుట్టు, డ్రై హెయిర్ వంటి ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తున్నారు. నిజానికి జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి హెయిర్ ప్రొడక్ట్స్ ను వాడటమే కాదు.. మంచి ఆహారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పోషకాలు జుట్టుకు పోషణను అందిస్తాయి. పోషకాలు ఎక్కువగా ఉండే కొన్ని ఆహారాలు హెయిర్ ఫాల్ ను ఆపుతాయి. అలాగే జుట్టు మందంగా, బలంగా పెరిగేందుకు సహాయపడతాయి. 

మన జుట్టు బలంగా ఉండాలన్నా.. పొడుగ్గా పెరగాలన్నా కొన్ని పోషకాలు చాలా అవసరమవుతాయి. కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి, ఐరన్, జింక్, ఇతర మల్టీ విటమిన్లు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని ఆపుతాయి. అలాగే మందపాటి, బలమైన జుట్టుకు సహాయపతాయి. ఇంతకీ ఎలాంటి ఆహారాలు తింటే జుట్టు రాలడం ఆగి మందంగా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

బచ్చలికూర

బచ్చలికూర జుట్టు పెరుగుదలకు అద్బుతంగా పనిచేస్తుంది. దీనిలో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. ఈ కూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ జుట్టు రాలడం ఆగుతుతంది. ఇక బచ్చలికూరలో ఇనుము కూడా  ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఎందుకంటే జుట్టు పెరుగుదలకు అవసరమైన పదార్థాల్లో ఇనుము ఒకటి. శరీరంలో ఇనుము స్థాయిలు తక్కువగా ఉంటే జుట్టు విపరీతంగా రాలుతుంది. అందుకే హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్లు రెగ్యులర్ గా బచ్చలికూరను తింటే మంచిది. 
 

గుడ్లు

గుడ్లు సంపూర్ణ ఆహారం. జుట్టును ఆరోగ్యం ఉంచేందుకు, మందంగాపెరిగేందుకు ఈ ప్రోటీన్ చాలా అవసరం. గుడ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. జుట్టు రాలడాన్ని ఆపేందుకు అవసరమైన, జుట్టు పెరిగేందుకు అవసరమైన ప్రోటీన్, బయోటిన్ గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. మన జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారవుతుంది. అందుకే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. గుడ్లలో సెలీనియం, జింక్ కూడా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. 
 

berries

బెర్రీలు

బెర్రీల్లో విటమిన్ సి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు మూలాలను బలంగా ఉంచేందుకు కూడా ఇవి సహాయపడతాయి. రోజూ బెర్రీలను తింటే మీ జుట్టులో వచ్చే తేడాను గమనిస్తారు. విటమిన్ సి కొల్లాజెన్ కు మంచి మూలం. ఇది మీ జుట్టు బాగా పెరిగేందుకు చాలా అవసరం. బెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టు తెగిపోకుండా ఉండటానికి కూడా సహాయపడతాయి. 

బాదం పప్పులు

బాదం పప్పుల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, విటమిన్ బి1, విటమిన్ బి6, జింక్, సెలీనియం ఉంటాయి. ఇవి జుట్టు పెరిగేందుకు అవసరమైన పోషకాలు. మీ జుట్టు పెరిగేందుకు ఈ పోషకాలన్నీ అవసరమవుతాయి. బాదం పప్పులు మీ జుట్టుకు పోషణను ఇస్తాయి. అలాగే మీ జుట్టు బలంగా ఉండేందుకు, అందంగా మెరిసేందుకు సహాయపడుతుంది. బాదం పప్పులు వాతావరణ కాలుష్యం నుంచి మీ జుట్టును రక్షిస్తాయి. దీంతో మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. బాదం పలుకుల్లో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జుట్టును మందంగా చేయడానికి సహాయపడుతుంది. 
 

చియా విత్తనాలు

చిన్నగా ఉండే చియా విత్తనాల్లో ప్రోటీన్, భాస్వరం, రాగి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు మందంగా ఉండాలంటే ఈ పోషకాలు ఖచ్చితంగా ఉండాలి. చియా విత్తనాలు జుట్టుకు కెరాటిన్ ను అందిస్తాయి. ఇది మీ జుట్టు ఒత్తుగా, బలంగా ఉండటానికి సహాయపడుతుంది. చియా గింజల్లో ఉండే కాపర్ హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అలాగే మాడు ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా చూస్తుంది. ఇది మీ మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

click me!