ఓట్స్ తినేందుకు చాలా చప్పగా అనిపిస్తాయి. ఎలాంటి రుచి ఉండవు కాబట్టి వాటిని ప్రత్యేకంగా వండుకోవాలి. కొవ్వు తక్కువగా ఉండే పాలతో ఓట్స్ ఉడికించుకుని తినాలి. రుచి కోసం అందులో బెర్రీలు, నట్స్, చియా గింజలు వంటివి వేసుకుంటే మంచిది.
ఓట్స్‌తో పాటు ఉడికించిన కూరగాయలు కలిపి తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది. వీరు బరువు చాలా సులభంగా తగ్గుతారు. కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వాటిని ఉడికించి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లి ఓట్స్‌లో కలుపుకుని తినొచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ సమయంలో దీన్ని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.