చలికాలంలో నిమ్మరసం తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published Dec 4, 2022, 1:55 PM IST

చాలా మంది శీతాకాలంలో నిమ్మరసం తాగడం మానేస్తుంటారు. దీనివల్ల ఎక్కడ జలుబు చేస్తుందోనని. కానీ చలికాలంలో నిమ్మరసాన్ని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్ లో నిమ్మరసం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. 
 

ఆరోగ్యంగా ఉండటానికి రోగనిరోధక శక్తి బలంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారికి చిన్న సమస్య వచ్చినా.. తీవ్ర అనారోగ్యానికి గురవుతుంటారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అందుకే చలికాలంలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ కాలంలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే అవీ.. ఇవీ కాకుండా ఉదయాన్నే గ్లాస్ నిమ్మరసం తాగితే చాలంటున్నారు నిపుణులు. నిజానికి నిమ్మరసం తాగడం వల్ల ఈ ఒక్కటే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ప్రతిరోజూ నిమ్మరసం తాగాలి. నిమ్మకాయల్లో 'విటమిన్ సి' పుష్కలంగా ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. నిమ్మకాయల్లో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి అనేక ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఉదయాన్నే గ్లాస్ నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. అలాగే కొవ్వు స్థాయిలు కూడా తగ్గిపోతాయి. బరువు తగ్గాలనుకుంటే రోజూ గ్లాస్ నిమ్మరసం తాగండి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు జీవక్రియను పెంచుతుంది. సోంపు నీరు, నిమ్మకాయతో కలిపిన సెలెరీ నీరు కూడా బరువును తగ్గించడానికి సహాయపడతాయి. 

నిమ్మకాయలను సీజన్లతో సంబంధం లేకుండా వినియోగించొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఏ కాలాల్లో ఉపయోగించినా మంచి ప్రయోజనాలను పొందుతారు. కానీ సీజన్ ను బట్టి దానిని తీసుకునే విధానం మాత్రం మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిమ్మరసం చల్లగా ఉంటుంది. అందుకే చలికాలంలో నిమ్మకాయను గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇలా రోజుకు రెండుసార్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. నిమ్మకాయను ఆహారంలో కలిపి కూడా తీసుకోవచ్చు. 
 

lemon

శీతాకాలంలో పండ్లు, కూరగాయలను ఎక్కువ మొత్తంలో తినాలని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే ఈ సీజన్ లో కూడా నీటిని పుష్కలంగా తాగాలి. లేదంటే మీ శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. అలాగే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఈ సమస్యలను నివారించడానికి రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగండి. 

చలికాలంలో చాలా మంది వ్యాయామం చేయడానికి అస్సలు ఇష్టపడరు.  వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో మెటబాలిజం నెమ్మదిస్తుంది. అలాగే బరువు విపరీతంగా పెరిగిపోతారు. ఈ సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా వ్యాయామం చేయండి.

click me!