చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలు ఇవే..!

First Published | Oct 30, 2022, 2:00 PM IST

చలికాలం షురూ అయ్యింది. ఇక ఇప్పటి నుంచి స్వెటర్ లేకుండా బయటకు వెళ్లడం కష్టమే. చలి కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వస్తుంటాయి. ఈ సీజన్ లో మీ శరీరంలో వేడి తగ్గకూడదంటే వీటిని తప్పకుండా తినండి. 
 

కాలాలు మారుతూ ఉంటాయి. కాలాలతో పాటుగా ఎన్నో రకాల రోగాలు కూడా వస్తుంటాయి. అందుకే కాలాలకు తగ్గట్టు మన ఆహారాలను కూడా మార్చుకోవాలి. ముందే ఇది చలికాలం. ఈ కాలంలో మన ఒంట్లో వేడి తగ్గకుండా చూసుకోవాలి. ఇందుకోసం వేడిని పెంచే ఆహారాలను తినాల్సి ఉంటుంది.  సాధారణంగా శీతాకాలంలో ఆకు కూరలు, క్యారెట్లు, పెసరపప్పు పుడ్డింగ్, రబ్డీ, మొక్కజొన్న రొట్టెలు  మొదలైన ఆహారాలను ఎక్కువగా తింటుంటారు. ఇవి రుచిగా ఉండటమే కాదు.. మన శరీరంలో వేడి తగ్గకుండా కూడా చూస్తాయి. ఇంతకీ ఈ సీజన్ లో ఎలాంటి ఆహారాలను తినాలో తెలుసుకుందాం  పదండి. 

మొక్కజొన్న రొట్టె 

ఈ సీజన్ లో మొక్కజొన్నలు పుష్కలంగా లభిస్తాయి. మొక్కజొన్నలతో చేసిన రొట్టెలను పంజాబ్ లో ఎక్కువగా తింటుంటారు. మొక్కజొన్న రొట్టెలో కొద్దిగా తెల్ల వెన్న, చిన్న బెల్లం ముక్కను నంజుకుని తింటే బలే టేస్టీగా ఉంటుంది. ఇలా తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు కూడా అందుతాయి. అంతేకాదు ఇది మిమ్మల్ని వెచ్చగా కూడా ఉంచుతుంది.
 

Latest Videos


carrot halwa

క్యారెట్ హల్వా

క్యారెట్ హల్వా ను చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. నెయ్యిలో తయారు చేసిన క్యారెట్ హల్వా ఒక ప్రసిద్ధ, సాంప్రదాయ వంటకం. క్యారెట్ హల్వాపై డ్రై ఫ్రూట్స్ ను గార్నిష్ చేస్తే.. మళ్లీ మళ్లీ దీన్ని తినాలనిపిస్తుంది. చలికాలంలో క్యారెట్ ను తప్పకుండా తినాలి. ఎందుకంటే దీనినుంచి మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఈ క్యారెట్లు తినడం వల్ల నోటి ఆరోగ్యం బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 
 

వెయిటేబుల్ సూప్

రకరకాల కూరగాయలు, నూడుల్స్ తో తయారుచేసిన వెజిటేబుల్ సూప్ మన ఆరోగ్మానికి చాలా మంచిది. ఈ సూప్ చాలా కారంగా ఉంటుంది. చలికాలంలో జలుబు, దగ్గు ఉంటే ఈ సూప్ ను ఖచ్చితంగా తాగండి. ఈ సూప్ వీటిని తగ్గిస్తుంది. 
 

గోండు లడ్డూ 

గోండు లడ్డూను చెట్టు బెరడు నుంచి తీసిన జిగురుతో తయారు చేస్తారు. ఇది మీరు సంవత్సరం పొడవునా తినగలిగే వంటకం. ఇది శీతాకాలపు చలిని ఎదుర్కోవటానికి మీకు శక్తిని ఇస్తుంది. దీనిలో వేడి చేసే గుణం ఉంటుంది. వీటినీ కొన్ని రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. దీనిలో ఉండే పోషకాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. 
 

నువ్వుల చిక్కీ

బెల్లం, వేరుశనగ, చిక్కీలను కూడా శీతాకాలంలో ఎక్కువగా తింటారు. వేరుశెనగ, బెల్లంతో తయారు చేసిన చిక్కీలో పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కొంతమంది దీనిని స్నాక్స్ గా తింటుంటారు. చలిని తట్టుకోవడానికి ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది మీ శరీరంలో వేడిని పెంచుతుంది. 
 

click me!