దేవుడి మందిరంలో శంఖం ఉండటం శుభం. దీనివల్ల ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవని నమ్ముతారు. అందుకే పూజా సమయంలో, శుభకార్యాలు, పండుగలకు దేవలయాల్లో శంఖాన్ని ఖచ్చితంగా ఊదుతారు. జ్యోతిష్యం ప్రకారం.. శంఖం పవిత్రమైంది. ఇంట్లో శంఖం ఉండటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే దేవుళ్లతో పాటుగా శంఖానికి కూడా పూజ చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం... శంఖాన్ని కీర్తి, సంవృద్ధి, దీర్ఘాయుష్షు కోసం పూజిస్తారు. శంఖం ఊదటం వల్ల ప్రతికూల శక్తులు, దుష్ట శక్తులు వదిలిపోతాయని నమ్ముతారు. శంఖంలోని ప్రతి భాగం దేవతల నివాసంగా చెప్తారు.
నిజానికి శంఖం మతపరంగానే కాదు.. దీని వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అన్నీ.. ఇన్నీ కాదు తెలుసా?. అవేంటో తెలుసుకుందాం పదండి..