మీ చర్మం అందంగా కనిపించాలా? అయితే ఈ కూరగాయలను మరువకుండా తినండి

First Published Sep 23, 2022, 9:58 AM IST

కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, న్యూట్రిషియన్స్ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. చర్మాన్ని కూడా అందంగా మెరిపిస్తాయి. 
 

ఆరోగ్యంతో పాటుగా..  చర్మ సంరక్షణ కూడా ముఖ్యమే. అందుకే మనలో చాలా మంది చర్మ సంరక్షణ కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. అలాగే ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ను కూడా వాడుతుంటారు. అయితే వీటిలో ఎంతో కొంత కెమికల్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. వీటిని వాడటం వల్ల అప్పటి మందం చర్మం అందంగా కనిపించినప్పటికీ.. ఫ్యూచర్ లో ఎన్నో చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొన్ని రకాల కూరగాయలను తిన్నా మీ చర్మం ఆరోగ్యంగా, అందంగా మారిపోతుంది. కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, న్యూట్రీషియన్స్ చర్మం కాంతివంతంగా మారిపోతుంది. ఇందుకోసం ఎలాంటి కూరగాయలను తినాలో తెలుసుకుందాం పదండి. 

టమాటాలు

టమాటాలు కూడా చర్మ సంరక్షణగా ఉపయోగపడతాయి. ఎందుకంటే టమాటాలు చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యంలో  వచ్చే చర్మంపై ముడతలు, ఇతర నల్లటి మచ్చలను తొలగిస్తాయి. అంతేకాదు సన్ స్ట్రోక్ నుంచి చర్మాన్ని రక్షించడానికి కూడా పనిచేస్తుంది. అందుకే వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. ప్రతిరోజూ ఒక గ్లాసు టొమాటో జ్యూస్ తాగడం వల్ల చర్మంపై ముడతలు పడే అవకాశమే ఉండదు. 
 

దోసకాయ

దోసకాయ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. చర్నాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోసకాయకు మించి బెస్ట్ కూరగాయ మరోటి లేదు. కీరదోసలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుది. ఇది మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. కీరదోసకాయను జ్యూస్ గా చేసుకుని తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 

క్యారెట్లు

క్యారెట్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే క్యారెట్లు చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె  లు చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి క్యారెట్లను మీ రోజు వారి ఆహారంలో తప్పకుండా చేర్చుకోండి. దీనిని జ్యూస్ గా చేసుకుని తాగినా.. మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
 

బీట్ రూట్

బీట్ రూట్ పోషకాల భాండాగారం. దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాదు.. చర్మం కూడా ఆరోగ్యంగా మెరిసిపోతుంది. ఈ బీట్ రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే బీట్ రూట్ మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, రంగు మారడానికి కూడా సహాయపడుతుంది.
 

ఆకుకూరలు

ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. వీటిలో ఉండే పోషకాలు వృద్ధాప్యం లక్షణాలైన చర్మంపై ముడతలను తొలగించడానికి సహాయపడతాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో కూడా సహాయపడతాయి. కాబట్టి బచ్చలికూర, బ్రోకలీ, మోరింగా ఆకులు వంటి ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోండి. 
 

click me!