వీటిని తింటే అబ్బాయిలు ఆరోగ్యంగా, బలంగా ఉంటారు..

First Published Sep 22, 2022, 4:58 PM IST

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పురుషులు తమ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎన్నో రకాల రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. 
 

గజిబిజీ లైఫ్ కారణంగా చాలా మంది పురుషులు ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అందులో గుండెపోటు, క్యాన్సర్, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, డయాబెటీస్ వంటి జబ్బుల బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇలాంటి సమస్యలు రాకూడదంటే మీ ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలి. అబ్బాయిలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఈ ఆహారాలను తప్పకుండా తినాల్సి ఉంటుంది. అవేంటంటే.. 

పాలు

పాలు పసిపిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు, విటమిన్ డి, లుటిన్, కాల్షియం, అమైనో ఆమ్లాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషుల శరీరాన్ని బలంగా చేయడానికి సహాయపడతాయి. 
 

గుడ్లు

ఆదివారమైనా.. సోమవారమైనా రోజూ తినండి గుడ్డు అని ప్రతిరోజూ టీవీ యాడ్ లో పేపర్లో చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ గుడ్లు సంపూర్ణ ఆహారం. దీనిలో ఐరన్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, లుటిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఒక ఉడకబెట్టిన గుడ్డును తింటే శరీరం బలంగా తయారవుతుంది. ఎన్నోరకాల పోషకాల లోపం కూడా పోతుంది. 
 

విత్తనాలు

మన వంటగదిలో ఉండే వివిధ రకాల విత్తనాలు కూడా పురుషులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ విత్తనాల్లో ఫైబర్, సహజ కొవ్వులు, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి పెద్ద పేగు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తాయి. 

గ్రీన్ వెజిటేబుల్స్

మాంసాహారాల కంటే గ్రీన్ వెజిటేబుల్స్ యే మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయంటారు నిపుణులు. అందుకే వీటిని ప్రతిరోజూ తినాలని చెబుతుంటారు. బచ్చలి కూర, బ్రోకలీ, పాల కూర, క్యాబేజీ  వంటి కూరగాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చితే పురుషులు ఆరోగ్యంగా, బలంగా ఉంటారు. 
 

డ్రై ఫ్రూట్స్

డ్రూ ఫ్రూట్స్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా పోగొడుతాయి. ప్రతిరోజూ గుప్పెడు నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాదు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. వాల్ నట్స్, బాదం పప్పులను తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 
 

click me!