కలబందను ఇలా వాడితే.. జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది..

First Published Sep 22, 2022, 4:29 PM IST

హెయిర్ ఫాల్ తగ్గిపోయి.. జుట్టు వేగంగా పెరగాలని చాలా మంది ఉల్లిపాయ ప్యాక్ ను వేసుకుంటుంటారు. అయితే ఏవేవో పెట్టేబదులు.. కలబందను ఇలా ఉపయోగిస్తే.. జుట్టు ఊడిపోవడం ఆగిపోయి బాగా పెరుగుతుంది. 
 

ఈ రోజుల్లో ఒత్తైన జుట్టు ఉన్నవారు చాలా తక్కువే. పొల్యూషన్, పోషకాల లోపం, చుండ్రు వంటి వివిధ కారణాల వాల్ల జుట్టు విపరీతంగా రాలిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి కొంతమంది  కెమికల్స్ ప్రొటక్ట్స్ ను వాడితే మరికొంత మంది మాత్రం ఇంటి చిట్కాలను ఫాలో అవుతున్నారు. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి బయటపడటానికి ఒక్కొక్కరు ఒక్కో పద్దతిని ఫాలో అవుతుంటారు. అయితే కలబంద హెయిర్ ఫాల్ ను తగ్గించడానికి సహాయపడుంది. జుట్టు పెరిగేందుకు కూడా సహాయపడుతుంది. ఇందుకోసం కలబందను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి. 

కలబందలో ఆముదం కలిపి హెయిర్ ప్యాక్ ను రెడీ చేసుకోవచ్చు. ఇందుకోసం కలబంద ఆకుల నుంచి గుజ్జును తీయండి. ఇప్పుడు దానితో ఆముదం నూనె వేసి బాగా కలపండి. దీన్ని మాడు నుంచి జుట్టు కొనల వరకు అప్లై చేయండి. ఇది పూర్తిగా ఎండిపోయిన తర్వాత షాంపూతో జుట్టుకు క్లీన్ చేయండి. 
 

కలబంద, గుడ్డును మిక్స్ చేసి కూడా హెయిర్ ప్యాక్ ను తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం కలబంద గుజ్జులో గుడ్డులోని తెల్లసొనను వేసి బాగా కలగలపండి. దీన్ని మాడు నుంచి జుట్టు కొనల వరకు అప్లై చేయండి. దీన్ని 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత  తలస్నానం చేయండి. వారానికి 2 నుంచి 3 రోజులు ఈ ప్యాక్ ను వేసుకోవడం వల్ల జుట్టు ఊడిపోవడం ఆగిపోయి.. వేగంగా పెరుగుతుంది. 

కలబంద, తేనె, కొబ్బరి నూనెతో చేసిన ప్యాక్ జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ  హెయిర్ ప్యాక్ జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ముందుగా కలబంద గుజ్జును తీసుకుని అందులో తేనె, కొబ్బరి నూనె వేసి బాగా కలపండి. ఈ ప్యాక్ ను  మాడు నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేయండి. ఒక 20 నిమిషాల తర్వాత షాంపూతో శుభ్రం చేయండి.  ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు త్వరగా పెరుగుతుంది.

ఈ ప్యాక్ లో కాల్షియం, సోడియం, పొటాషియం, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్, విటమిన్లు వంటి మూలకాలు ఉన్నాయి. కావాలనుకుంటే గుడ్లు, కలబంద, నిమ్మరసంతో ప్యాక్ ను తయారుచేసి జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం గుడ్డులోని తెల్లసొనను తీసుకుని అందులో కలబంద జెల్ ను, కాస్త నిమ్మరసాన్ని వేసి కలగలపండి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి జుట్టు కొనల వరకు అప్లై చేయండి. అది పొడిగా ఉన్నప్పుడు కడిగేయండి. ఇది జుట్టును తేమగా ఉంచడంతో పాటుగా హెల్తీగా పెరిగేలా చేస్తుంది. 

click me!