ఈ పోషక లోపాలు మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా ఉంటాయి.. జర జాగ్రత్త..

First Published Oct 22, 2022, 2:07 PM IST

మగవారితో పోల్చితే.. ఆడవారికే ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కారణం.. వారిలోనే ఎక్కువగా పోషకాలు లోపించడం. అందుకే పోషకాలు లోపించకుండా చూసుకోవాలి. 
 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆడవారిలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలకు పోషకాల లోపమే ప్రధాన కారణం. అందుకే ఆడవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకున్నప్పటికీ పోషకాలు లోపించే అవకాశం ఎక్కువగా ఉంది. దీనివల్ల లేని పోని రోగాలు చుట్టుకుంటాయి. ముఖ్యంగా ఎముకల నొప్పి, అలసట, వేళ్ల జలదరింపు, మగత, కండరాల బలహీనత వంటివి పోషకాల లోపం వల్లే వస్తాయి. ఇవి పోషకాల లోపం లక్షణాలు కూడా. ఏం కాదులే అని వదిలేస్తే సమస్య పెద్దదవుతుంది. అంతేకాదు దీర్ఘకాలిక సమస్యలకు దారితీస్తుంది. అందుకే ఆడవారు తినే ఆహారాల్లో పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మహిళల్లో ఎక్కువగా ఎలాంటి పోషకాలు లోపిస్తాయి.. దాన్ని పోగొట్టడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఇనుము లోపం

ఇది మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. నెలసరి కారణంగా ఆడవారికి ప్రతి నెలా రక్తస్రావం అవుతుంది. దీనిని భర్తీ చేయకపోతే రక్తహీనత సమస్యలు ఎక్కువవుతాయి. రక్తహీనత అంటే మన శరీరంలో రక్తం లేకపోవడమని అర్థం. ఎర్ర రక్త కణాలే శరీర కణజాలాలకు ఆక్సిజన్ ను తీసుకువెళతాయి. ఈ రక్తహీనత కారణంగా శరీరంలో ఐరన్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల విపరీతమైన అలసట, నాలుక నొప్పి, మైకము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు కలుగుతాయి. 

శరీరంలో ఐరన్ లెవల్స్ పెరగాలంటే ఆడవారు బఠాణీలు, బీన్స్, ముదురు ఆకుపచ్చ కూరగాయలు, సీఫుడ్, ఎర్ర మాంసం, తృణధాన్యాలు, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు వంటి పండ్లను తినాలి. 
 

calcium


కాల్షియం లోపం 

 మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం కాల్షియం.  ఇది ఎముకలను, దంతానలు ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో ఈ ఖనిజం లోపిస్తే.. బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అనేక నివేదికల ప్రకారం.. 8, 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలు, 50 ఏళ్లు పైబడిన మహిళల శరీరంలోనే కాల్షియం తక్కువగా ఉంటుంది. దీనివల్ల వీళ్లకు దంత సమస్యలు, ఎముకలు బలహీనపడటం, హృదయ స్పందనలు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. 

పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు, బచ్చలికూర, సాల్మన్, తృణధాన్యాల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయి పెరుగుతుంది.
 

అయోడిన్ లోపం

థైరాయిడ్ పనితీరుకు, థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ చాలా అవసరం. ఇది జీవక్రియను నిర్వహించడమే కాదు నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీరం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో అయోడిన్ స్థాయి తక్కువగా ఉంటే థైరాయిడ్ గ్రంధి అసాధారణంగా పెరుగుతుంది. దీనిని గోల్ గోండ్ అని కూడా అంటారు. దీనివల్ల బలహీనంగా అనిపించడం, జుట్టు రాలడం, అలసట, చల్లగా అనిపించడం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. 

గుడ్లు, సీఫుడ్, పాల ఉత్పత్తులు, షెల్ఫిష్, ఉప్పు, చికెన్ వంటి ఆహారాల్లో ఎక్కువ మొత్తంలో అయోడిన్ ఉంటుంది. 
 

click me!