ఈ అలవాట్లుంటే పిల్లలు పుట్టడం కష్టమే..!

Published : Oct 22, 2022, 01:05 PM IST

కొన్ని అలవాట్ల వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతే పిల్లలు పుట్టడం కష్టంగా మారుతుంది. అందుకే ఇలాంటి అలవాట్లకు కాస్త దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.   

PREV
17
ఈ అలవాట్లుంటే పిల్లలు పుట్టడం కష్టమే..!
sperm

పిల్లలు పుట్టకపోవడానికి కారణాలేన్నో ఉంటాయి. కానీ చాలా మంది ఆడవారిలోనే లోపం ఉందని.. అందుకే పిల్లలు పుడ్తలేదని అవమానిస్తారు. నిజానికి పిల్లలు పుట్టకపోవడానికి ఆడవారిలోనే లోపం ఉంటుందనేది పచ్చి అబద్దం. మగవారి అలవాట్ల వల్లే ఎక్కువగా ఇలా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని అలవాట్ల వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గుతుంది. ఇది వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతుంది. సెక్స్ సమయంలో స్పెర్మ్ సాధారణం కంటే తక్కువగా రిలీజ్ అవుతుంది. తక్కువ స్పెర్మ్ కౌంట్ ను ఒలిగోస్పెర్మియా అని కూడా అంటారు.

27
sperm

హార్మోన్ల అసమతుల్యత, వీర్యకణాలను రవాణా చేసే కణితుల లోపాలు, రసాయనాలు, కణితులు, అంటు వ్యాధులు, స్ఖలనం వంటి సమస్యలు పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను బాగా తగ్గిస్తాయని నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి అలవాట్లు పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తాయో తెలుసుకుందాం పదండి. 

37
sperm

అనాబాలిక్ స్టెరియిడ్లు

కండరాలు బలంగా ఉండేందుకు, పెరుగుదల కోసం చాలా మంది అనాబాలిక్ స్టెరాయిడ్లను ఉపయోగిస్తుంటారు. కానీ వీటిని ఉపయోగించడం వల్ల వృషణాలు కుంచించుకుపోతాయి. దీంతో స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతుంది. వీటికి తోడు కొకైన్ ఉపయోగించడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. నాణ్యత కూడా లోపిస్తుంది. 
 

47
sperm

ఆల్కహాల్

అప్పుడప్పుడు ఆల్కహాల్ ను తాగితే వచ్చే నష్టమేమీ ఉండదు. కానీ అదే పనిగా దీన్ని తాగితే మాత్రం పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అంటే ఆల్కహాల్ టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది కూడా. ఈ ఆల్కహాల్ ను తాగడం వల్ల ఆడవారు, మగవారు ఇద్దరిలో పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. మద్యం తాగడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశం కూడా తగ్గుతుంది. 

57

స్మోకింగ్

స్మోకింగ్ చేయని వారితో పోలిస్తే స్మోకింగ్ చేసే మగవారిలోనే వీర్యకణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి కూడా. స్మోకింగ్, పొగాకు స్పెర్మ్ DNA కు నష్టాన్ని కలిగిస్తాయి. నాణ్యతను తగ్గిస్తాయి. 
 

67

ఒత్తిడి

ఒత్తిడి చాలా డేంజర్. ఇది వల్ల ఎన్నో మానసిక, శారీరక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి వల్ల సంతానోత్పత్తి చాలా తగ్గుతుంది. ఒత్తిడి వీర్యాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. డిప్రెషన్ కూడా స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది. యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేస్తే.. ఒత్తిడి తగ్గుతుంది. 
 

77

స్థూలకాయం

స్థూలకాయం  ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచడంతో పాటుగా స్పెర్మ్ నాణ్యతను కూడా తగ్గిస్తుంది. స్థూలకాయం వల్ల పురుషుల సంతానోత్పత్తిని తగ్గించే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. రోజూ సమతుల్య ఆహారం తీసుకుంటూ.. వ్యాయామం చేస్తూ స్థూలకాయం తగ్గుతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories