ఈ వ్యాధులుంటే చిలగడదుంపలను తినకండి.. లేదంటే..?

First Published Dec 17, 2022, 4:57 PM IST

చలికాలంలో చిలగడదుంపను తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఇవి మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. అయితే కొన్ని రోగాలతో బాధపడేవారు మాత్రం వీటిని పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

చలికాలంలో చిలగడదుంపలను ఎక్కువగా తింటుంటారు. ఎందుకంటే ఇది మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. వీటిలో మెగ్నీషియం, విటమిన్లు, ప్రోటీన్లు, పొటాషియం, ఇనుముతో సహా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే ఊబకాయం తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గిపోతాయి. కడుపు పూత నయమవుతుంది. చిలగడదుంపలను ఉడకబెట్టి తింటే ఎన్నో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. అయితే కొన్ని రోగాలతో బాధపడేవారు మాత్రం ఈ చిలగడదుంపలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్లెవరెవరు అంటే.. 
 

మూత్రపిండాల్లో రాళ్లు

మూత్రపిండాల్లో రాళ్లున్న వారు చిలగడదుంపలను అసలే తినకూడదు. ఎందుకంటే చిలగడదుంపల్లో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి దాన్ని తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వీటిలో ఉండే ఆక్సలేట్ రాళ్లపై పేరుకుపోతుంది. అందుకే వీళ్లు చిలగడదుంపలను తినకూడదు. 
 

గుండె జబ్బులు

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. అయితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు కూడా చిలగడదుంపలను తినకూడదు. ఎందుకంటే వీటిలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది Hyperkalemia ప్రమాదాన్ని పెంచుతుంది. 

షుగర్ పేషెంట్లు

షుగర్ పేషెంట్లు కూడా చిలగడదుంపను తినడం మానుకోవాలి. ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెరిగిపోతాయి. మన దేశంలో సుమారుగా 7 కోట్ల మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారట. 
 

కడుపు సమస్యలు

కడుపునకు సంబంధించిన సమస్యలుంటే కూడా చిలగడదుంపలను తినకపోవడమే మంచిది. కడుపునకు సంబంధించిన సమస్యలున్న వారు చిలగడదుంపలను తింటే విరేచనాలు, పొత్తి కడుపు నొప్పి, వాపు వంటి సమస్యలు వస్తాయి. 

click me!