ఇట్లైతే మీకు నిద్రసరిపోవడం లేదని అర్థం తెలుసా?

First Published Nov 29, 2022, 10:56 AM IST

మీ శరీరానికి నిద్రసరిపోకపోయినా.. ఇంకా నిద్ర అవసరమైనా.. మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. అయినా నిద్రపోకపోతే మీ ఆరోగ్యాన్ని మీరే చేజేతులారా నాశనం చేసుకున్నవారవుతారు. 
 

మన శరీరానికి నిద్ర చాలా చాలా  అవసరం. ఎందుకంటే నిద్రతోనే శరీరం తిరిగి శక్తివంతంగా తయారవుతుంది. శరీరాన్ని రిపేర్ చేసుకుంటుంది. అప్పుడే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. రోజుకు ఒక వ్యక్తికి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు.  అయితే కొంతమంది బిజీ షెడ్యూల్స్ కారణంగా నిద్రకు ఇంత సమయాన్ని కేటాయించలేకపోతుంటారు. దీనివల్ల వీళ్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినొచ్చు. కంటినిండా నిద్రపోతే ఎన్నో రోగాల ముప్పు కూడా తప్పుతుంది. అయితే సరిపడా నిద్రపోకపోతే మన శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఈ సంకేతాను ఏ మాత్రం లైట్ గా తీసుకున్నా.. హాస్పటళ్ల పాలవుతారు జాగ్రత్త. ఇంతకి నిద్రసరిపోలేదనడానికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.. 

మీ అంతట మీరు లేవడం కష్టం

సాధారణంగా కంటినిండా నిద్రపోతే.. ఉదయం నిద్రలేవడానికి ఎలాంటి అలారం అవసరం లేదు. ఎవరూ లేపాల్సిన పని లేదు. కానీ కొంతమంది ఎంత లేపినా.. అలారం ఎంత మొత్తుకున్నా అస్సలు లేవరు. ఇలాంటివారు కంటినిండా నిద్రపోవడం లేదని అర్థం. అందుకే కొంతమంది నిద్రలేచిన తర్వాత కూడా మళ్లీ పడుకుంటారు. అలారం మోగినా దాన్ని ఆపేసి మరీ పడుకుంటారు. మీకు నిద్ర సరిపోవడం లేదనడానికి ఇదే మొదటి లక్షణం. 
 

ఏకాగ్రత తగ్గడం

నిద్రలేమి కారణంగా ఏకాగ్రత పూర్తిగా పోతుంది. మీ మనస్సు మీ ఆదీనంలో ఉండదు. ఏదో పనిచేస్తున్నామా అంటే చేస్తారు అంతే.. కానీ పనిలో నిమగ్నమవ్వరు. ఏకాగ్రత చూపరు. దీనివల్ల మీ పనిలో అన్ని తప్పులే ఉంటాయి. మీరొక్కచోట.. మీ మనసొక చోట ఉంటుంది. దీనివల్లే ఏ పనిని సక్రమంగా చేయలేరు. 

మెమోరీ పవర్ తగ్గుతుంది

నిద్రలేమి వల్ల మీ మెమోరీ పరవ్ బలహీనంగా మారుతుంది. ఎప్పుడో ఒకసారి విషయాలను మర్చిపోవడం కామన్ యే కానీ.. ఎప్పుడూ ఏదో ఒకటి మర్చిపోవడం మాత్రం నిద్రలేమి లక్షణమేనంటున్నారు నిపుణులు. అందుకే మీ శరీరానికి సరిపడా విశ్రాంతినివ్వండి. మీ మనస్సుకు కూడా రెస్ట్ అవసరమే. ఇందుకోసం రోజూ కంటినిండా నిద్రపోయేలా చైసుకోండి. 
 

డ్రైవింగ్ చేయడంలో ఇబ్బంది

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారు ఎక్కువ సోమరిగా ఉంటారు. వీళ్ల శరీరం హుషారుగా ఉండదు. యాక్టీవ్ గా పనిచేయలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితిలో డ్రైవింగ్ చేయడం చాలా కష్టం. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రమత్తుగా అనిపిస్తుంది. అంతేకాదు నిద్రకూడా పోయే అవకాశం ఉంది. దీనివల్ల మీ జీవితం ఏమౌతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. 
 

చిరాకు

కంటికి సరిపడా నిద్రలేనప్పుడు మీ మెదడు సరిగ్గా పనిచేయదు. మీరు ఊరికూరికే చిరాకు పడిపోతుంటారు. మీ మెదడుకుు విశ్రాంతి లేకుంటే ఇలా అవుతుంది. నిద్రలేమి వల్ల శరీరం బాగా అలసిపోతుంది. మీ శరీరం, మనస్సు రెండూ ఒత్తిడికి గురవుతాయి. 
 

టీ, కాఫీలు

టీ, కాఫీలు మనల్ని రీఫ్రెష్ గా చేస్తాయి. అందుకే చాలా మంది ఉదయం పక్కాగా టీ లేదా కాఫీని తాగుతుంటారు. ఇవి మన శరీరానికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. ఎక్కువ మొత్తంలో తాగితే మాత్రం ప్రమాదకరంగా మారతాయి. వీటిని అతిగా తాగుతున్నట్టైతే మీరు నిద్రలేమి సమస్య బారిన పడ్డారని అర్థం. టీ, కాఫీల్లో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు నిద్రలేకుండా చేస్తుంది. 
 

click me!