కూరగాయలను ఉడికించి తింటే మంచిదా? లేకపోతే పచ్చిగా తింటే మంచిదా?

Published : Jan 10, 2023, 01:05 PM IST

కూరగాయల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయినప్పటికీ వీటిని కొంతమంది ఆవిరిలో ఉండికించి తింటే.. ఇంకొంత మంది మత్రం పచ్చిగానే తింటుంటారు. ఈ రెండింటిలో ఏ పద్దతిలో కూరగాయలను తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

PREV
17
కూరగాయలను ఉడికించి తింటే మంచిదా? లేకపోతే పచ్చిగా తింటే మంచిదా?
steaming foods

మన శరీరానికి విటమిన్లు, ఖనిజాలు చాలా అవసరం. కూరగాయలు వీటన్నింటినీ అందిస్తాయి. కంటిచూపును పెంచడం నుంచి మెరిసే చర్మం, బరువు తగ్గడం వరకు కూరగాయలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. కానీ కూరగాయలను ఉడికించి తింటే మంచిదని చాలా మంది చెప్తుంటారు. పోషకాలను లాక్ చేయడానికి కూరగాయలను ఆవిరి చేయడం ఉత్తమ మార్గం అని కొందరు అంటున్నారు. మరికొందరు ముడి ఆకుకూరలను తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుందని ఇంకొందరు అంటుంటారు. క్యారెట్లు, ముల్లంగి వంటి కూరగాయలను పచ్చిగా తింటుంటారు.  మరి ఇతర కూరగాయలను..? ఆవిరి పట్టిన కూరగాయలు మన శరీరానికి అవసరమైన పోషకాలను చంపుతాయా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కూరగాయల నుంచి ఎక్కువ పోషకాలను పొందడానికి వీటిని ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

27

జర్నల్ ఆఫ్ జెయిజాంగ్ యూనివర్శిటీ సైన్స్ ప్రకారం.. బ్రోకలీ పోషకాలు, ఆరోగ్యాన్ని ప్రోత్సహించే సమ్మేళనాలపై ఒక అధ్యయనం జరిగింది. ఆవిరి తప్ప మిగతా అన్ని వంట పద్ధతుల వల్ల విటమిన్ సి, క్లోరోఫిల్  ను బాగా తగ్గిస్తాయని ఫలితాలు చూపించాయి. మొత్తం కరిగే ప్రోటీన్లతో పాటు కరిగే చక్కెరలలో కూడా గణనీయమైన తగ్గుదల ఉంది. అలీఫాటిక్, ఇండోల్ గ్లూకోసినోలేట్స్ కూడా అన్ని వంట పద్ధతుల ద్వారా తగ్గిపోతాయి. ఆవిరి ద్వారా మాత్రం కాదు. ఆవిరి కూరగాయలు ముఖ్యంగా బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ అధ్యయనం స్పష్టంగా చూపిస్తోంది. ఆవిరి పట్టిన కూరగాయలను తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు.. 

37

శీఘ్ర వంట పద్ధతి

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కూరగాయలను ఆవిరి చేయడం ఇతర వంట పద్ధతులతో పోలిస్తే సురక్షితమైన, వేగవంతమైన వంట పద్ధతి. నిజానికి కూరగాయలను వేయించడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీరు ఆహారాన్ని చాలా నూనెలో ఉడికించినప్పుడు చాలా పోషకాలు తగ్గిపోతాయి. కానీ కూరగాయలను ఉడకబెట్టడానికి మాత్రం కొన్ని నిమిషాల టైం మాత్రమే పడుతుంది.
 

47

ఆవిరి ఎక్కువ పోషకాలను నిలుపుకుంటుంది

స్టీమింగ్ కూరగాయలలో నియాసిన్, బీటా కెరోటిన్, పాంతోతేనిక్ ఆమ్లం , విటమిన్ సి వంటి చాలా పోషకాలు పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే అవి నీటిలో కరిగేవి కాబట్టి. ఆవిరి వాటిని నీటిలో లీచ్ చేయడానికి, గ్రహించడానికి సహాయపడుతుంది.

57

ఉడికించిన కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి

ముఖ్యంగా బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కొన్ని కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఆవిరి కూరగాయలను మృదువుగా చేస్తుంది. కాబట్టి ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. ముడి కూరగాయలు అంత సులువుగా అరగవు. 
 

67

స్టీమింగ్ కూరగాయల రంగు, ఆకృతిని మార్చదు

మీరు కూరగాయలను సరిగ్గా ఆవిరి చేసినప్పుడు వాటి రంగు, ఆకృతి చెక్కుచెదరకుండా ఉంటాయి. కానీ అతిగా ఆవిరి పట్టడం వల్ల రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

77

ముడి కూరగాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ముడి మొలకలు తినడం ఆరోగ్యకరమైన అలవాటని చాలా మంది భావిస్తారు. పచ్చి కూరగాయలతో రోజును ప్రారంభించే వారు చాలామందే ఉన్నారు. ఉడికించిన మొలకలు విటమిన్ సిని పెంచుతాయి. వీటిని పచ్చిగా తినడంతో పోలిస్తే జీర్ణక్రియను 100 శాతం సురక్షితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. కానీ ఇది ఉబ్బరం, అపానవాయువుకు కారణమవుతుంది. కానీ ముడి కూరగాయలను తినేటప్పుడు.. బ్యాక్టీరియా, కాలుష్యం, భద్రత, పారిశుధ్యం పెద్ద సమస్యలుగా మారుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories