సోంపు గింజల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ గింజలు పోషకాలకు మంచి వనరు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు వంటి దివ్య ఔషదగుణాలు పుష్కలంగా ఉంటాయి. సోంపులో ఐరన్, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ సోంపు జీర్ణం సాఫీగా కావడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని తినడం వల్ల ఒక్కటేమిటీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అయితే ఈ సోంపు తినడం వల్ల పురుషులకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సోంపు తినడం వల్ల అబ్బాయిలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..